సాయంత్రం అయ్యేసరికి పకోడీలు, బజ్జీలు వేసుకోవడం చాలా మందికి అలవాటు. అందులో చలికాలం కాబట్టి వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ నచ్చేలా ఎగ్ కబాబ్ చేస్తే రుచితో పాటూ, శక్తి కూడా అందుతుంది.
కావాల్సిన పదార్థాలు
గుడ్లు - ఆరు
శెనగపిండి - 150 గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - గుప్పెడు
మిరియాల పొడి - ఒక టీస్పూను
కారం పొడి - ఒకటిన్నర స్పూను
బ్రెడ్ పొడి - ఒక కప్పు
ఉప్పు - రుచికి తగినంత
ఆయిల్ - వేయించడానికి సరిపడినంత
నీళ్లు - అరకప్పు
తయారీ
1. గుడ్లను నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో చిటికెడు ఉప్పు కూడా వేయాలి.
2. గుడ్లు ఉడికాక పెంకులు తీసేసి ఆ గుడ్లను గ్రేటర్ తో తురమాలి. తురిమిన గుడ్లను ఒక గిన్నెలో వేయాలి.
3. ఆ గుడ్లలో శెనగపిండి, ఉల్లిపాయ తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం పొడి, మిరియాల పొడి, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపాలి.
4. మరీ జారేలా కాకుండా కాస్త గట్టిగా మిశ్రమం కలుపుకోవాలి.
5. స్టవ్ కళాయి పెట్టా ఆయిల్ వేసి వేడి చేయాలి.
6. ఆయిల్ బాగా వేడెక్కాక గుడ్ల మిశ్రమాన్ని కబాబ్స్ లా చేత్తో ఒత్తుకుని బ్రెడ్ పొడిలో ఓసారి దొర్లించాలి.
7. ఆ కబాబ్స్ ను నూనెలో వేసి వేయించాలి.
8. వీటిని టిష్యూ పేపర్ లో వేసి నూనె పీల్చుకునేలా చేశాక తినాలి. నూనె పీల్చుకును పేపర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని వాడడం మాత్రం తప్పనిసరి. నూనె ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యం.
9. పిల్లలకు ఎంతో నచ్చే స్నాక్స్ ఇది. ఉల్లిపాయ ముక్కలతో పాటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: పిల్లలు లావుగా ఉంటే వారి గుండె అనాటమీపై ప్రభావం... చెబుతున్న కొత్త అధ్యయనం
Also read: మీలో ఎంతమందికి తెలుసు నేతాజీ ఒక ఐఏఎస్ ఉద్యోగి అని? ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మహానేత
Also read: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం