Stress Management Techniques : ఒత్తిడిలేని వ్యక్తి ఉన్నాడంటే అతను కోటీశ్వరుడితో సమానం. నిజం చెప్పాలంటే అతనికంటే కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. అవును డబ్బు ఉన్నా, జాబ్ ఉన్నా, రిలేషన్​లో ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండట్లేదు. పైగా ఎక్కువ స్ట్రెస్​కి గురవుతున్నారు. ఇది కేవలం పెద్దలకే కాదు.. పిల్లల్లో కూడా కనిపిస్తుంది. దీనిని అస్సలు తక్కువ అంచనా వేయవద్దని.. దానిపై అవగాహన కల్పిస్తూ స్ట్రెస్ అవేర్​నెస్ డే(Stress Awareness Day)లు నిర్వహిస్తున్నారు. 

Continues below advertisement

పనిలో, ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో పెరిగిపోయిన ఒత్తిడిని గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహనలు కల్పిస్తున్నారు. అలాగే స్ట్రెస్​ తగ్గించుకునేందుకు కొన్ని సరైన మార్గాలు ఎంచుకోవాలని చెప్తున్నారు. self care importance అనే అంశాన్ని అందరూ గుర్తించుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఈ విషయాన్ని తెలుసుకుని.. తమ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ట్రై చేయాలని చెప్తున్నారు మానసిక నిపుణులు. 

ఒత్తిడి తగ్గకుంటే

ఒత్తిడిని తగ్గించుకోకపోతే అది శరీరంపై, మనస్సుపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, బీపీ (Blood Pressure), గుండె సమస్యలు, నిద్ర సమస్యలు పెంచుతుంది. ఉద్యోగులు తమ పనిలో మంచి ఫలితాలు చూడలేరు. కెరీర్​ పరంగా నష్టపోవాల్సి వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. రిలేషన్​షిప్స్, సంబంధాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. మరి ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఏవి ఫాలో అయితే బెస్టో చూసేద్దాం. 

Continues below advertisement

బౌండరీలు పెట్టుకోండి.. 

వర్క్​ టైమ్​, పర్సనల్​ టైమ్​ని కచ్చితంగా డివైడ్ చేయండి. ఆఫీస్​ వర్క్​ని ఇంటివరకు తీసుకెళ్లకండి. ఇంట్లో సమస్యల ఎఫెక్ట్ ఆఫీస్ వర్క్​పై చూపించకండి. 

టాస్క్​లు సెట్ చేసుకోండి.. 

మీరు రోజూ చేయాల్సిన పనుల్లో ముందుగా, ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏంటి? కాస్త ఆలస్యంగా చేసిన పర్లేదు అనుకునే వర్క్స్ ఏంటో డిసైడ్ అవ్వండి. Task Priority System Follow ఫాలో అయితే వర్క్ ప్రెజర్ తగ్గుతుంది. 

చిన్న బ్రేక్స్.. 

పని చేయాలి కదా అని అస్సలు రెస్ట్ లేకుండా వర్క్ చేయకండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని కాఫీ లేదా టీ తాగడం లేదా వాక్ చేయడం వంటివి చేయడం వల్ల బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. వర్క్ చేసేప్పుడు మైండ్ ఫ్రెష్​గా ఉంటే.. ప్రొడెక్టివిటీ పెరుగుతుంది. 

బ్రీతింగ్ వర్క్​ అవుట్స్​...

డెస్క్​లో ఉన్నప్పుడు కూడా చేయగలిగేవి బ్రీతింగ్ వర్క్​ అవుట్స్. వీటిని ఫాలో అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. డీప్ బ్రీత్ తీసుకుని.. దానిని నెమ్మదిగా వదలండి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా చేస్తే కచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. 

ఆఫీస్ పాలిటిక్స్​..

దాదాపు అన్ని ఆఫీస్​లలో ఆఫీస్​ పాలిటిక్స్ ఉంటాయి. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండండి. ఒకరితో కంపేర్ చేసుకోవడమో.. కాంపీటేషన్​గా తీసుకోవడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. మీకు వచ్చిన పనిని.. ప్రశాంతంగా మీరు చేసుకుని బయటపడిపోవడం చాలా ఉత్తమం. అలాగే స్కిల్, గ్రోత్, సెల్ఫ్​ పర్​ఫార్మెన్స్​ని మెరుగుపరచుకునేందుకు ట్రై చేయండి. ఇది మీ ప్రొడెక్టివిటీ పెంచుతుంది. 

శారీరక వ్యాయామం.. 

ఉదయం లేదా సాయంత్రం జిమ్​కి వెళ్తే మంచిది. లేదా ఇంట్లోనే వ్యాయామం లేదా యోగా చేయండి. ఆఫీస్​లో కాసేపు వాకింగ్ చేయండి. దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. 

ఇవే కాకుండా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. హెల్తీ డైట్ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. షుగర్, కెఫెన్ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. నట్స్, కొబ్బరి నీళ్లు, పండ్లు వంటివి స్నాక్స్​గా తీసుకోవచ్చు. అలాగే మీరు నమ్మిన వ్యక్తితో లేదా జడ్జ్ చేయని వ్యక్తితో మీ వర్క్ గురించి డిస్కస్ చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీ స్ట్రెస్ తగ్గించుకుని.. ప్రశాంతంగా పర్సనల్ లైఫ్ లీడ్ చేయండి.