Ectopic Pregnancy Risks : ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ప్రాణాలు పోతాయా అంటే కచ్చితంగా అని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల గర్భంతో ఉన్న మహిళ జీవనం ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు. అసలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రమాదకరం? దీనికి చికిత్స ఉందా? వైద్యులు ఇచ్చే సూచలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ కడుపులో కాకుండా.. ట్యూబ్​లో పెరుగుతుంది. ఇలా లోపలి పిండం ఫాలోపియన్ ట్యూబ్​లో ఏర్పడడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ట్యూబ్​లో పిండం పెరగలేకపోవడం వల్ల ఆ ట్యూబ్ చీలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల రక్తస్రావం అంతర్గతంగా జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్న యువతి షాక్​లోకి వెళ్లిపోయి.. మరణానికి దారి తీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు..

పీరియడ్ స్కిప్ అవ్వడం, ప్రెగ్నెన్సీ టెస్ట్​లో పాజిటివ్​ రావడంతో పాటు.. కడుపులో లేదా పెల్విక్​లో ఒకవైపు షార్ప్​గా గుచ్చుకున్నట్టు, పొడుస్తున్నట్లు అనిపిస్తుందట. బ్లీడింగ్ రెగ్యులర్​గా కంటే ఎక్కువగా అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం వల్ల భుజాల దగ్గర నొప్పి రావడం, కళ్లు తిరిగి పడిపోవడం, బీపీ తగ్గడం, షాక్​లోకి వెళ్లడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలట.. లేకుంటే ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. అయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సాధారణ ప్రెగ్నెన్సీ కూడా పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. 

పెళ్లికానీ యువతుల్లో.. 

ప్రస్తుతం ఈ తరహా కేసులు పెళ్లికానీ యువతుల్లో ఎక్కువగా వస్తున్నాయని.. గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి తెలిపారు. అర్థరాత్రుళ్లు హాస్పటల్​కి వస్తారని.. అప్పటికే రెండు లీటర్ల రక్తస్రావం అవుతుందని.. యువతి షాక్​లోకి వెళ్లిపోయి ఉంటుందని.. ఈ పరిస్థితి చాలా ప్రమాదమని తెలిపారు. ఇదంతా సేఫ్టీ లేకుండా లైంగికంగా పాల్గొనడం, ప్రెగ్నెన్సీ యూట్రస్​లో ట్యూబ్​లో రావడం.. ఒకవేళ ట్యూబ్​లో ప్రెగ్నెన్సీ వస్తే అది పగిలితే రెండు లీటర్ల రక్తం పోయి షాక్​లోకి వెళ్లి.. చికిత్స అందించకుంటే అది మరణానికి దారితీస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స

ఈ తరహా ప్రెగ్నెన్సీ ముందుగానే గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స చేసి ప్రాణాన్ని కాపాడవచ్చని చెప్తున్నారు. ఇలా ట్యూబ్​లో పిండం పెరగడానకి ఎన్నో కారణాలు ఉంటాయని.. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా మీరు ప్రెగ్నెంట్ అని డౌట్ వచ్చినప్పుడు వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లి పరిస్థితిని చెక్ చేయించుకోవాలని చెప్తున్నారు. 

రాత్రి పడుకుంటే ఉదయానికి లేవకపోవచ్చు

యూత్ తమ రెస్పాన్స్​బులిటీ వారు తీసుకోవాలని.. లేకుంటే ఫ్యూచర్​లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శిల్పి రెడ్డి సూచిస్తున్నారు. లైంగిక సమస్యలు అంటే కేవలం ఎస్టీడీలు, హెచ్​ఐవీలే అనుకుంటారని.. వాటిని మించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయని.. వీటిపట్ల యువత కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలియక.. కడుపు నొప్పి అనుకుని రాత్రి పడుకుంటే ఉదయమయ్యే సరికి శవంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ షాకింగ్ విషయాలు తెలిపారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.