నల్ల కోళ్లను కడకనాథ్ కోళ్లు అంటారు. అలా అని నల్లగా కనిపించేవన్నీ కడకనాథ్ కోళ్లు కాదు. ఇవి ప్రత్యేకమైన జాతికి చెందినవి. ఇవి మధ్యప్రదేశ్లోని ఝబుబా జిల్లాలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీటి మాంసం కూడా నల్లగా ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ చికెన్ అని పిలుస్తారు. స్థానికులు ‘కాళీమాసి’ అని అంటారు. ఝబుబా జిల్లాకు చెందిన ఈ కోడికి 2018లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. అంటే ఆ ప్రాంతానికే ఈ కోళ్లు చాలా ప్రత్యేకమైన అర్థం.


సాధారణ కోళ్లతో పోలిస్తే కడకనాథ్ కోడి మాంసాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. కడకనాథ్ కోడి మాంసంలో 11 అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అదే సాధారణ కోడి మాంసంలో మూడు రకాల అమైనో ఆమ్లాలు మాత్రమే లభిస్తాయి. కాబట్టి బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే కడకనాథ్ కోళ్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. చికెన్ తినడం వల్ల అధిక యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండడమే ఈ కోళ్ళ స్పెషాలిటీ. ఈ బ్లాక్ చికెన్లో విటమిన్ బి1, బి2, బి6, బి12, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ దీనిలో 25% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక కొవ్వు రెండు శాతం కన్నా తక్కువ ఉంటుంది. 


కడకనాథ్ కోడి మాంసంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు. ఈ కోడి మాంసాన్ని తింటే ఎంతో మంచిది. ఇది హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. మహిళలు, చిన్నపిల్లలు కడకనాథ్ కోడి మాంసాన్ని తినడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముందుంటుంది. సాధారణ చికెన్‌తో పోలిస్తే ఈ నల్ల కోళ్లు పదిరెట్లు ఎక్కువ ప్రొటీన్ అందిస్తాయి. దీనిలో కార్నోసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇదొక యాంటీ ఆక్సిడెంట్.  దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇది మన దృష్టిని మెరుగుపరుస్తుంది.  


కడకనాథ్ కోడి మాంసాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ధమనులకు రక్షణ లభిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గుండెకు కూడా మంచిది. గుండెకు రక్తప్రసరణను పెంచుతుంది. రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. కడకనాథ్ కోడి మాంసంలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కడకనాథ్ గుడ్లలో కూడా పోషకాలు అధికం. 100 గ్రాముల ఈ గుడ్డులో 11.67 ప్రోటీన్ ఉంటుంది. బరువు తగ్గడానికి ఈ గుడ్లు మంచి ఎంపిక. తలనొప్పి, ఆస్తమా వంటి ఉన్నవారు ఈ గుడ్లను తింటే మంచిది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఈ పెంచుతాయి. 


Also read: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం









































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.