Healthy Food Tips: మనం రోజంతా కష్ట పడి.. ఎంత కొంత డబ్బును సంపాదించుకుంటాము. అలా సంపాదించినా డబ్బుతో కావాల్సిన కూరగాయలు, వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేస్తాము. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే, అంత ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. ఇది శరీరం , మెదడును సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది.


ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం మానసిక , శారీరక అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. మనకు తగిన కేలరీలు, పోషకాలు చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. సమతుల్య ఆహారంలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి మీ ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం మీ శక్తిని పెంచుతుంది. ఇది శరీర పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీ మధ్యాహ్న భోజనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏయే ఆహారపదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవాలి, ఏవి  తీసుకోకూడదనే  విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం.


మధ్యాహ్న భోజనంలో తీసుకోవాల్సిన  ఆహార పదార్ధాలు 


సలాడ్లు: వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో కూడిన  సలాడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు,  మినరల్స్ వంటి రిచ్ న్యూట్రీషియన్స్ శరీరానికి శక్తిని అందించి చురుకుగా ఉంచుతాయి.


లీన్ ప్రోటీన్ : భోజనం కోసం, లీన్ ప్రోటీన్ ఎంచుకోవడానికి ఉత్తమం. అధిక కేలరీలు, హెవీ ఫుడ్స్ తినడం మంచిది కాదు. లీన్ ప్రోటీన్ ఆహారాలు భోజనం చేసిన వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.


పెరుగు : చాలా మంది భోజనం ముగిశాక నిద్రపోకుండా ఉండేందుకు పెరుగు తింటారు. పెరుగును మధ్యాహ్న భోజనంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్వార్క్ యొక్క ప్రీబయోటిక్ లక్షణాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.


ధాన్యాలు : మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, క్వినోవా, రోటీ , తృణధాన్యాలు వంటి ధాన్యాలు తినడం వల్ల అధిక స్థాయి శక్తి లభిస్తుంది.


పండ్లు : కేలరీలు, ప్రోటీన్లు పొందడానికి, మీ ఆహారంలో పండ్లను తీసుకోండి. ఎందుకంటే, దీనిలో  పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే  దీనిలో ఉండే పీచు పదార్థం  అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.


మధ్యాహ్నం లంచ్ లో తినకూడని ఆహారాలు


వేయించిన ఆహారాలు: మధ్యాహ్నం ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. సమోసాలు, పకోడీలు, వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించండి. చాలా కారంగా ఉండే ఆహారాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కూరల్లో అధిక నూనెను తగ్గించండి.


ప్రాసెస్ చేసిన మాంసాలు: మధ్యాహ్న భోజనంలో ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక కొవ్వు పదార్ధాల వినియోగాన్ని తగ్గించండి. అవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.


ఫాస్ట్ ఫుడ్: కొంతమంది మధ్యాహ్న భోజనంలో పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్స్ తింటారు. అలాంటి వారు అస్సలు ఆరోగ్యంగా ఉండలేరు. దీనిలో నూనెల వల్ల మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది.  


Also Read : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.