వెల్లుల్లి లేకుండా ఏ వంటిల్లు ఉండదు. ప్రతి ఒక్కరూ తమ కూరల్లో వెల్లుల్లి ఉపయోగిస్తారు. ఇది వంటలకి అదనపు రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శీతాకాలంలో వెల్లుల్లి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంతో పాటు జలుబు, ఫ్లూ వంటి అనేక సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. ఇటువంటి కీలక సమయంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి మనల్ని మనం వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి వెల్లుల్లి గొప్ప మార్గం. అందుకే ఈ సీజన్లో తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శీతాకాలం ఆహారం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇచ్చే సుగంధ మూలికలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక వ్యాధులని దూరం చేస్తుంది.


వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఔషధాల్లో ఉపయోగించే వారు. మధుమేహ రోగులు కూడా తరచూ దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గొంతు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీళ్ళని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు దరి చేరవు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కాలంలో తరచూ వచ్చే రోగాలని అడ్డుకుంటుంది. వెల్లుల్లిలోని గుణాలు శరీరంలో రక్తసరఫరా బాగా జరిగేలా చూస్తాయి.


శీతాకాలంలో వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు


☀ బరువు తగ్గడానికి సహాయపడుతుంది


☀ జలుబు, దగ్గుని నివారించడంలో సహాయపడుతుంది


☀ శ్వాసకోశ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది.


☀ అధిక రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది.


☀ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.


☀ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది.


☀ వెల్లుల్లిని నమలడం లేదా చూర్ణం చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వైరస్ లతో పోరాడే తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది.


☀ శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయకారిగా ఉపయోగపడుతుంది.


☀ వెల్లుల్లి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కండరాల వాపు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.


☀ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు మృదులాస్థి దెబ్బతినకుండా నిరోధించడానికి చాలా మంది డాక్టర్స్ వెల్లుల్లి నూనెని సూచిస్తారు.


☀ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుతుంది. 


☀ వెల్లులి రక్త నాళాలను శుభ్రపరిచి గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది.


☀ అల్జీమర్స్, డీమెన్షియా వంటి క్షీణించిన వ్యాధులని నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.


☀ బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు మేలు చేస్తుంది. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.


☀ వెల్లుల్లి నీరు కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. రోజూ తాగడం వల్ల ఆ నొప్పులు అదుపులో ఉంటాయి.


☀ వెల్లుల్లి అతిగా తిన్నా సమస్యే. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆకలి తగ్గడం, మైకం వంటి సమస్యలు ఎదురవుతాయి.  


Also Read: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.