అధిక బరువు వల్ల రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం. మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం వంటి అనేక తీవ్రమైన, దీర్ఘకాలిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అందరూ బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ అది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామని కాదు. సన్నగా ఉంది బరువు తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టే అని అనుకుంటారు చాలా మంది.  అలాగే బరువు తగ్గించే ఆహారాలు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. సాధారణంగా తీసుకునే ఆహారం కంటే అదనపు కేలరీలు తగ్గించి తీసుకుంటే కొంతవరకి సహాయం చేసినప్పటికీ దీర్ఘకాలంలో అది మంచి కంటే హాని ఎక్కువ చేస్తుంది.


అధ్యయనం ఏం చెప్తోంది?


బరువు తగ్గించడంలో ఆహారం కీలకం. అది పండ్లు, కూరగాయలు తీసుకోవడం మరీ ముఖ్యం. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. కానీ తగిన మోతాదు కంటే ఇంకా తక్కువ తీసుకుంటే మాత్రం అది హాని చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్స్ 2022 లో సమర్పించిన ఒక నివేదిక షాకింగ్ విషయాలు పేర్కొంది. అధ్యయనం ప్రకారం 35-58 సంవత్సరాల వయస్సు కలిగిన 116 మంది పెద్దల డైట్ చార్ట్ పరిశీలించారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు.


శరీర బరువు, అందుకు వాళ్ళు తీసుకుంటున్న ఆహారం, ఇతర కార్యాచరణ స్థాయిలని ఒక ఏడాది పాటు పరిశీలించారు. ఇందులో పాల్గొన్నవారు తీసుకున్న ఆహారం హెల్తీ ఈటింగ్ ఇండెక్స్ (HEI) ఆధారంగా ఎంత ఆరోగ్యవంతమైనదని భావిస్తున్నారో దానికి ఒకటి నుంచి 100 వరకి రేటింగ్ ఇచ్చారు. 75 శాతం మంది పార్టిసిపెంట్‌లు తమ డైట్‌ని తప్పుగా స్కోర్ చేస్తున్నారని గ్రహించారు. వాళ్ళు తీసుకున్న ఆహారనికి సగటున వందలో 67.6 స్కోర్ రేటింగ్ ఇచ్చుకున్నారు. కానీ పరిశోధకులు HEI ని ఆధారంగా చేసుకుని 56.4 స్కోర్ ఇచ్చారు. సంవత్సరం తర్వాత ఇందులో పాల్గొనే వారి ఆహార పాయింట్లు 18 మెరుగుపడినట్లు నివేదించారు.


కూరగాయలే ముఖ్యం కాదట..!


కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలుక చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అందుకే వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ సలాడ్, క్రోటన్లు లేదా కేలరీలు ఇచ్చే ఆహారంపై దృష్టి పెట్టారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం పండ్లు, కూరగాయాలతో ముగియదని పరిశోధకులు తెలిపారు. పోషకాలు నిండిన వాటిని కూడా యాడ్ చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. సరైన పోషక విలువలు ఉన్న ఆహారం బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


పోషకాలు ముఖ్యమే..


బరువు తగ్గించుకునేందుకు మంచి ఆహారం ఎంపిక చేసుకోవాలి. అలాగే పోషకాలు సమతుల్యంగా ఉండే విధంగా చూడాలి. లేదంటే శరీరానికి తగినంత పోషకాలు అందకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా అని అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా వేరే వ్యాధులకి వచ్చేందుకు సంకేతంగా కూడ మారుతుందని గ్రహించాలి. అందుకే బరువు తగ్గాలని అనుకున్నపుడు డాక్టర్ ని సంప్రదించిన తర్వాత డైట్ చార్ట్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యవంతంగా బరువు తగ్గుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: వామ్మో, ఒళ్లు పెరిగితే కళ్లు పోతాయా? మీ కంటి చూపు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి