రుక్మిణి కళ్ళు మూసుకుని గుడిలో దేవుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటూ ఉంటుంది. మాధవ్ కంగారుగా గుడికి వచ్చి రుక్మిణి కోసం వెతుకుతూ ఉంటాడు. ‘నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోతే నేనేం కావాలి, ఇంతకాలం నీకోసం ఎదురు చూసింది నువ్వు ఆదిత్య కలిసిపోతే ఆశీర్వదించి అక్షింతలు వేయడానికా, నువ్వు ఎలా వెళ్లిపోతావో నేను చూస్తాను’ అని తాళి పట్టుకుని రుక్మిణి దగ్గరకి వస్తాడు. బలవంతంగా తన మెడలో తాళి కట్టడానికి ట్రై చేస్తుంటే తోసేస్తుంది.
మాధవ్: నీదారిన నువ్వు వెళ్లిపోతే నేనేం కావాలి రాధ, అందుకే ఈ తాళి కట్టి నిన్ను నాదాన్ని చేసుకుంటాను
రుక్మిణి: వద్దు సారు నా బతుకు నన్ను బతకనియ్యండి
మాధవ్: మర్యాదగా కట్టించుకో
రుక్మిణి మాధవ్ ని తోసేసి పారిపోతుంటే వెంటపడి పట్టుకుంటాడు.
రుక్మిణి: ఇది తప్పు సారు నా మెడలో నా పెనిమిటి కట్టిన తాళి ఉంది
మాధవ్: నీకోసం ఎన్ని తప్పులు చేశాను ఎలా వదిలిపెడతాను, తాళి కడితే నువ్వే నీ తప్పు తెలుసుకుని నాదగ్గర ఉండిపోతావ్
రుక్మిణి: నా పెనిమిటి కట్టిన తాళి ఇది దాన్ని చూసి అయిన విడిచిపెట్టండి
అది నీ మెడలో ఉంటేనే కదా అని మాధవ్ తాళి తెంచబోతుంటే సత్య వచ్చి మాధవ్ తల మీద కొట్టడంతో చచ్చిపోతాడు. ఏంటి సత్య ఇలా చేశావ్ అని రుక్మిణి టెన్షన్ పడుతుంది.
Also Read: ఆదిత్య, సత్య చెంపలు పగిలాయ్- దేవి తన మనవరాలని తెలుసుకున్న దేవుడమ్మ
సత్య: నాకోసం నువ్వు చేసిన త్యాగం కూడా మర్చిపోయి నానామాటాలు అన్నాను. ఏ అక్కా చేయని త్యాగం నువ్వు చేస్తే నిన్ను, ఆదిత్యని తప్పుగా అర్థం చేసుకుని చాలా మాటలు అన్నాను నన్ను క్షమించక్కా అని రుక్మిణి కాళ్ళ మీద పడుతుంది.
భాగ్యమ్మ పిల్లల్ని తీసుకుని గుడి దగ్గరకి వస్తుంది. అక్కడ మాధవ్ చనిపోయి ఉండటం చూసి చిన్మయి బాగా ఏడుస్తుంది. రుక్మిణి వాళ్ళు రావడం చూసి మాధవ్ ని సత్య కొట్టిన వస్తువు తన చేతులోకి తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి దేవుడమ్మ, ఆదిత్య కుటుంబం కూడా వస్తుంది. ఏం జరిగిందని దేవుడమ్మ అడిగితే ఆగమైన తన బతుకుని ఇంకా ఆగం చెయ్యాలని చూశాడు అందుకే చంపేశా అని చెప్తుంది. సత్య నిజం చెప్పబోతుంటే రుక్మిణి ఆపుతుంది. ఇక 'నీ పెనిమిటితో సంతోషంగా ఉండమని' సత్యతో చెప్తుంది.
చిన్మయి, దేవి బాధ్యతలని సత్యకి అప్పగిస్తుంది రుక్మిణి. ఇక నువ్వే వీళ్ళని చూసుకోవాలి అని అంటుంది. మన్నించమని దేవుడమ్మని అడుగుతుంది. బిడ్డలాగా చూసిన నిన్ను మోసం చేసి వచ్చాను, నీ నుంచి తప్పించుకోవడానికి నీ కోడలు కాదని అన్నాకాని చచ్చేదాక నీకోడలిని అని దేవుడమ్మ కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు నీజీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావ్ అని దేవుడమ్మ బాధపడుతుంది.
Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని
ఆదిత్య దగ్గరకి వచ్చి దేవిని తనకి అప్పగిస్తుంది. ‘నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నా, ఇకనైనా సత్య నువ్వు సంతోషంగా ఉండండి. మా నాయన ఎవరని అడిగేదానివి కదా ఈ ఆఫీసర్ సర్ మీ నాయన. నీకు నాయన్ని ఇచ్చా, మంచి కుటుంబాన్ని ఇచ్చాను. మంచిగా చదువుకో, అందరితో మంచిగా ఉండు’ అని పిల్లల్ని దగ్గరకి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. చిన్మయిని కూడా ఇచ్చి ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. చివరిసారిగా 'నీ పెనిమిటి కాళ్ళు మొక్కుతా సత్య' అని రుక్మిణి అడగటం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. పోలీసులు వచ్చి రుక్మిణిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అందరూ చాలా బాధపడతారు.
కొంతకాలం తర్వాత..
రుక్మిణి మళ్ళీ నాగలి పట్టి పొలం దున్నుతు ఉంటుంది. చిన్మయి తన దగ్గరే ఉంటుంది. అటుగా వెళ్తున్న ఆదిత్య, దేవుడమ్మ, దేవి, దేవుడమ్మ తనని చూసి సంతోషిస్తారు. మొదటి నుంచి నీ చెల్లెలి కోసం బతికావ్, తర్వాత భర్త కోసం, తర్వాత పిల్లలు కోసం బతికావ్. ఇప్పుడు ఆ అనాథకి అమ్మగా బతుకుతున్నావ్.. ఎప్పుడు నీకోసం కాకుండా ఇతరుల కోసం బతికావ్.. నిజంగా దేవతవే నువ్వు అని దేవుడమ్మ మనసులో అనుకుంటుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగలేదని మరో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుందని డైరెక్టర్ చెప్పకనే చెప్పి శుభం కార్డ్ వేశారు.
త్వరలో దేవత పార్ట్ 2 రాబోతుంది.