Curd Rice with Banana Benefits : సమ్మర్​లో చాలామంది తమ డైట్​లో పెరుగు, మజ్జిగను యాడ్ చేసుకుంటారు. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి పెరుగన్నం తింటూ ఉంటారు. కేవలం పెరుగున్నమే కాకుండా దానిలోకి అంచుగా అరటిపండు తీసుకుంటారు. ఇలా పెరుగున్నం అరటిపండు కలిపి తీసుకోవచ్చా? అలా తింటే కలిగే లాభాలు ఏంటి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

వేడి తగ్గిస్తుంది : సమ్మర్​లో పెరుగన్నంలో అరటిపండు వేసుకుని తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే వేడి వల్ల కలిగే ఒత్తిడి తగ్గి.. ఇబ్బందులను, చికాకును దూరం చేస్తుంది. 

హైడ్రేషన్ : వేసవిలో వచ్చే అతి పెద్ద ప్రధాన సమస్య డీహైడ్రేషన్. అయితే ఈ సమయంలో మీరు పెరుగున్నం తింటే డీహైడ్రేషన్ తగ్గి.. శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. 

జీర్ణ సమస్యలు : పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి హెల్తీ గట్​ని ప్రమోట్ చేస్తాయి. వేసవికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు దూరమవుతాయి. పైగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సమ్మర్​లో వివిధకారణాల వల్ల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఎంపిక. 

పొటాషియం : అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఇది సహజంగా పోషకాలను అందించి.. రక్తపోటును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పొటాషియం బీపీని కంట్రోల్ చేసే అతి ముఖ్యమైన ఖనిజం. సమ్మర్​లో వచ్చే బీపీ సమస్యలను తగ్గించుకోవడానికి తీసుకోవచ్చు. 

ఫైబర్ : అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుచేసి మలబద్ధకాన్ని నివారించడంలో హెల్ప్ చేస్తుంది. దీర్ఘకాలికంగా దీనితో ఇబ్బంది పడేవారు నిపుణుల సహాయంతో రెగ్యులర్​గా లిమిటెడ్​గా తీసుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 

పండని అరటిపండ్లు జీర్ణమవడం కష్టంగా ఉంటుంది. ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి పెరుగులో అరటిపండు వేసుకోవాలంటే పండినవి తీసుకుంటే మంచిది. స్వీట్​ పెరుగు లేదా ఇతర ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాటిలో షుగర్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి. లాక్టోస్ వల్ల మీకు ఇబ్బందులు ఉంటే పాల ఉత్పత్తులు మీకు అలెర్జీలు కలిగిస్తాయి. కాబట్టి దానిని తినకపోవడమే మంచిది. 

బరువు తగ్గాలనుకుంటే.. 

బరువు తగ్గాలనుకునేవారు పెరుగన్నంలో అరటిపండు కలిపి తినాలనుకుంటే పోర్షన్ కంట్రోల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది టేస్టీ కాంబినేషన్ అయినప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కేలరీలు ఎక్కువ అవుతాయి. రెగ్యులర్​గా ఇలా తీసుకుంటే బరువు పెరుగుతారు. పోషకాల అసమతుల్యత కూడా ఏర్పడే అవకాశముంది. కాబట్టి తినాలనుకుంటే కంట్రోల్​ చేసి తీసుకోవచ్చు. 

మరిన్ని టిప్స్.. 

మీరు ఈ కాంబినేషన్​ని మరింత టేస్టీగా, హెల్తీగా మార్చుకోవాలనుకుంటే జీలకర్ర, ధనియాలతో తాళింపు వేసి పెరుగులో కలిపి తీసుకోవచ్చు. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. వైట్​ రైస్​కి బదులు మీరు బ్రౌన్ రైస్​ తీసుకుంటే మరీ మంచిది. దీనిలోని ఫైబర్, పోషకాలు మరిన్ని శరీరానికి అందుతాయి. లేదంటే మీరు ఇతర ఫ్రూట్స్​తో కూడా టాపింగ్ చేసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.