Tips and Tricks for NaiL Care : గోళ్లు పెంచుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ పెంచుకున్నవాటిని సరిగ్గా రక్షించుకోకపోతే అవి చూసేందుకు చాలా చిరాకుగా కనిపిస్తాయి. మీ చేతుల అందాన్ని పూర్తిగా కరాబ్ చేస్తాయి. కాబట్టి గోళ్లకు సరైన సంరక్షణ అవసరం. గోర్లు అంటే కేవలం చేతివే అనుకుంటున్నారేమో.. కాళ్లవి కూడా అదే రేంజ్​లో సంరక్షించుకోవాలి. వాటిని శ్రద్ధగా కాపాడుకోవాలి. మీరు కొన్ని దృఢమైన, అందమైన గోర్లు కావాలి అనుకుంటే మీరు కొన్ని టిప్స్, హ్యాక్స్ ప్రయత్నించాలి. అంతేకాకుండా కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. గోళ్ల సంరక్షణలో ఉపయోగపడే టిప్స్, ట్రిక్స్ ఏంటో.. ఎలాంటి తప్పులు చేయకపోతే గోళ్లు మంచిగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి


గోళ్లను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే జెర్మ్స్, బ్యాక్టిరీయా ఎక్కువైపోతుంది. కాబట్టి గోళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసి.. పొడిగా ఉండేలా చూసుకోవాలి. పైగా గోర్లు ఎక్కువసేపు నీటిలో నానితే చీలిపోయే ప్రమాదముంది. అంతేకాకుండా గోళ్ల చుట్టూ చర్మం శుభ్రంగా, మురికి లేకుండా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం మీరు ఓ బ్రష్ తీసుకుని దానిపై కస్తా ఉప్పు వేసి.. మీ గోర్లు, వాటి చుట్టూ చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవచ్చు. అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేయవచ్చు. 


కొరకడం ఆపండి..


చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా గోళ్లు అందం పాడైపోవడమే కాకుండా వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. పైగా నోట్లో వేళ్లు పెట్టుకోవడం వల్ల మీ వేళ్లలోని మురికి, క్రిములు మీ నోటికి వ్యాపిస్తాయి. గోళ్లను కొరకడం ఆపడం కోసం.. మీరు నెయిల్ పాలిష్ ఉపయోగించండి. దీనివల్ల మీరు వ్యసనానికి దూరమయ్యే అవకాశముంది. 


పరిశుభ్రత


మీకు గోర్లు పెంచుకునే అలవాటు ఉన్నా లేకపోయినా మీరు గోర్ల పరిశుభ్రత పాటించాలి. గోళ్ల సంరక్షణ సాధనాలను ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి. గోర్లు పెంచుకోకూడదు అనుకుంటే రెగ్యూలర్​గా ట్రిమ్ చేయండి. దీనివల్ల గోళ్లలో మురికి పేరుకుపోకుండా ఉంటుంది. మీరు గోళ్ల సంరక్షణలో టీ ట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఇది బ్యాక్టీరియాను దూరం చేసి.. జెర్మ్స్ నుంచి రక్షిస్తుంది. 


మాయిశ్చరైజర్ మరచిపోవద్దు


గోళ్లకు మాయిశ్చరైజల్ కచ్చితంగా ఉపయోగించాలి. లేదంటే పొడిబారిపోయి గోళ్లు విరిగిపోయే ప్రమాదముంది. అంతేకాకుండా గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పెరుగుదలకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే గోళ్లకు తేమను అందించాలి. మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల గోర్లు నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం మీరు హ్యాండ్ క్రీమ్స్​, ఆయిల్స్, మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవచ్చు. 


కత్తిరించండి


గోర్లు పెంచుకోవాలి కరెక్ట్​నే కానీ.. వాటికి ట్రిమ్ చేస్తూ ఉండాలి. అప్పుడే అవి మరింత దృఢంగా, పెరుగుతాయి. జుట్టును ట్రిమ్ చేస్తే అది ఎలా పెరుగుతుందో.. గోర్లు కూడా కట్ చేస్తే వాటిలో మంచి పెరుగుదల ఉంటుంది. గోళ్ల కట్ చేయడం, వాటికి మంచి షేప్ ఇవ్వడం మీ గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


బేస్ కోట్


గోళ్లను రక్షించుకోవడం కోసం మీరు కెరాటిన్, విటమిన్ ఇ, ఆముదం, కాల్షియం వంటి పదార్థాలతో కూడిన బేస్​ కోట్ నెయిల్ పాలిష్ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి నెయిల్ ఉత్పత్తులు మీ గోళ్లకు చాలా మంచివి. వాటిని హైడ్రేట్ చేస్తూ వాటికి మంచి పోషణ అందిస్తాయి. 


డోంట్ పీల్..


చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. గోళ్లకు అందంగా రంగు వేసుకుని.. ఆ అందాన్ని చెడగొట్టేలా నెయిల్ పాలిష్​ను గోకేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గోళ్లపై ఉండే సహజమైన లేయర్ పోతుంది. అలా చేయడం వల్ల గోళ్లు బలహీనంగా మారుతాయి. మీరు గోళ్ల రంగు తీసేయాలనుకుంటే నెయిల్ పాలిష్ రిమూవర్​ని ఉపయోగించవచ్చు. 


బాగా తినండి..


గోళ్లకు లోపలి నుంచి పోషణ అందడానికి మీరు బాగా ఫుడ్ తినాలి. కాల్షియం లోపం వల్ల గోళ్లు పాడైపోతాయి. కాబ్టటి మీ ఆహారంలో తగినంత కాల్షియం ఉండేటట్లు చూసుకోవాలి. నట్స్, బీట్​రూట్​, సోయా, బీన్స్, తృణధాన్యాలు, ఆకుకూరలు వంటి విటమిన్ ఇ, ప్రోటీన్, ఐరన్, విటమిన్ డి, జింక్, మెగ్నీషియం కలిగిన ఫుడ్ తీసుకోవాలి. 


ఈ ట్రిక్స్, టిప్స్ పాటిస్తే మీ గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా గోళ్ల సంరక్షణ కోసం మీరు పెడిక్యూర్, మెనిక్యూర్ వంటివాటిని కూడా ఆశ్రయించవచ్చు. కానీ మీరు పార్లర్​లో ఎంత మంచి ట్రీట్​మెంట్ చేయించుకున్నా.. వాటిని సంరక్షించుకోవడం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేదానిపై గోళ్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. 


Also Read : హెయిర్​ఫాల్​ను కంట్రోల్​ చేసి.. జుట్టు పెరుగదలను ప్రోత్సాహించే సింపుల్ చిట్కాలు