Dry, Flaky Skin During Weather Changes : వాతావరణంలో మార్పులు మొదలవ్వగానే.. ఆరోగ్యంతో పాటు చర్మం కూడా ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు వేడి, చలి, తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారవచ్చు. దీంతో ముఖ కండరాల బిగుతుగా మారుతాయి. చేతులు, పెదవులు, కాళ్లు కూడా పగిలి.. తెల్చని పొరలాంటి మచ్చలను ఏర్పరుస్తాయి. ఇలాంటి సమయంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
కొబ్బరి నూనెతో..
పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి చాలామంది కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. స్నానం చేసిన తర్వాత లేదా పడుకునే ముందు, కొద్దిగా తడిగా ఉన్న చర్మంపై కొబ్బరి నూనెను వేసి రాసుకోవాలి. ఇది తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
Also Read : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
కలబంద జెల్
కలబంద గుజ్జు కూడా చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా ఉండే అలొవెరా జెల్‌ను ముఖానికి, చేతులకు రాసుకోవచ్చు. అలాగే క్రీమ్ రూపంలో దొరికే వాటిని కూడా చర్మానికి ఉపయోగించవచ్చు కానీ.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
తేనెతో..
తేనె కూడా చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. దానిని కొంతసేపు ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. దీనిని కూడా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
Also Read : నయాసినమైడ్ Vs విటమిన్ C.. స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఏది బెస్ట్? మీ చర్మం కోసం ఇలా ఎంచుకోండి
స్నానం చేసిన తర్వాత..
స్నానం చేసిన వెంటనే చర్మానికి కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. స్కిన్ ఇంకా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ రాసుకోండి. ఇది తేమను ఎక్కువ సేపు నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
వేడి నీటితో స్నానం..
చల్లని వాతావరణంలో చాలామంది వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. కానీ బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే.. చర్మంలోని సహజ నూనెలను తొలగిపోతాయని చెప్తున్నారు నిపుణులు. దానికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చట.
Also Read : పండుగ తర్వాత స్కిన్ డల్‌గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్‌ప్యాక్స్ ట్రై చేయండి
హైడ్రేషన్ ముఖ్యం..
ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నీటి శాతం శరీరంలో తగ్గితే చర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. అలాగే నీటితో పాటు పండ్లు, ఆకుకూరలు, నట్స్, హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి.
చేయకూడని తప్పులు ఇవే
తరచుగా ముఖం కడుక్కోవడం, చర్మాన్ని గట్టిగా రుద్దడం వంటివి మానుకోవాలి. అలాగే ముఖం కడుక్కోవడానికి ఘాటైన వాసన గల సబ్బు లేదా కఠినమైన ఫేస్ వాష్‌కు బదులుగా, తేలికపాటి క్లెన్సర్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పెదవులు పొడిబారితుంటే.. పెట్రోలియం జెల్లీని రాయండి. చేతులు, పాదాలు పొడిగానే ఉంటే.. నిద్రపోయే ముందు ఏదైనా క్రీమ్ అప్లై చేయండి. చర్మం దురద, ఎరుపు, పగుళ్లు లేదా చికాకు ఎక్కువకాలం కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
