Niacinamide or Vitamin C For Skin Concerns : ముఖంపై మొటిమలు, జిడ్డు, పెద్దగా కనిపించే పోర్స్ ఉంటే ఒక సీరమ్ కొనాలా? లేక పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తగ్గించుకోవడానికి విటమిన్ C వాడాలా? స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఇది. నయాసినమైడ్, విటమిన్ C రెండూ మంచి స్కిన్‌కేర్ పదార్థాలే అయినా.. రెండూ ఒకేలా పని చేయవని చెప్తున్నారు స్కిన్ కేర్ నిపుణులు. మీ చర్మ సమస్య, స్కిన్ టైప్‌ను బట్టి వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Continues below advertisement

డెర్మటాలజిస్ట్ ప్రకారం.. ఈ రెండు పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మరి నయాసినమైడ్, విటమిన్ సి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మీ చర్మానికి ఏది సరిపోతుందో.. వాటిని ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Also Read : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే

Continues below advertisement

నయాసినమైడ్ లాభాలు

నయాసినమైడ్ అనేది విటమిన్ B3 రూపం. ఇది చర్మం సహజ రక్షణ పొరను లేదా స్కిన్ బ్యారియర్‌ను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే చర్మంలో అధికంగా ఉత్పత్తి అయ్యే జిడ్డును నియంత్రించడంలో కూడా ఉపయోగపడవచ్చు. నయాసినమైడ్ మెలనిన్ చర్మ కణాలకు చేరే ప్రక్రియపై ప్రభావం చూపి పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడవచ్చు. 

మొటిమలు, ఎర్రబడటం, పెద్దగా కనిపించే పోర్స్ సమస్యలున్న వారికి కూడా ఇది మంచిదని చెప్పవచ్చు. నయాసినమైడ్‌ ఉపయోగించాలనుకుంటే.. ఉదయం లేదా రాత్రి స్కిన్‌కేర్ రొటీన్‌లో దీనిని చేర్చుకోవచ్చు. 

Also Read : ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే

విటమిన్ సి ఉపయోగాలు

విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. సూర్యరశ్మి, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మంపై ఏర్పడే ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది. మెలనిన్ ఉత్పత్తిలో భాగమైన టైరోసినేస్ అనే ఎంజైమ్‌పై ప్రభావం చూపి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా మద్దతు ఇస్తుంది. అందుకే యాంటీ-ఏజింగ్ స్కిన్‌కేర్‌లో దీనిని ప్రముఖంగా ఉపయోగిస్తారు.

డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉన్నవారు, స్కిన్ టోన్ అసమానంగా ఉన్నవారు, చర్మం డల్‌గా కనిపిస్తుంటే, యాంటీ-ఏజింగ్ స్కిన్‌కేర్ కోసం చూస్తుంటే దీనిని వాడవచ్చు. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో విటమిన్ C కొన్నిసార్లు మంట లేదా చికాకు కలిగించవచ్చు. కాబట్టి తక్కువ గాఢత ఉన్న ఉత్పత్తితో ప్రారంభించడం మంచిది. దీనిని ఉదయం ఉపయోగిస్తే సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి.

Also Read : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి

నయాసినమైడ్ Vs విటమిన్ సి.. 

మీ స్కిన్ అవసరాన్ని బట్టి ఏది ఎంచుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. జిడ్డు, మొటిమలు, సెన్సిటివ్ స్కిన్, స్కిన్ బ్యారియర్ సమస్యలు ప్రధానంగా ఉంటే నయాసినమైడ్ ఒక మంచి ఎంపిక. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డల్ స్కిన్, అసమాన స్కిన్ టోన్ ప్రధాన సమస్య అయితే విటమిన్ సి బెస్ట్.

రెండింటినీ కలిపి వాడొచ్చా?

నయాసినమైడ్, విటమిన్ సి రెండింటినీ స్కిన్‌కేర్ రొటీన్‌లో ఉపయోగించవచ్చు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ రక్షణ, స్కిన్ బ్రైట్‌నింగ్‌పై పనిచేస్తే.. నయాసినమైడ్ చర్మాన్ని సాంత్వనపరచడం, స్కిన్ బ్యారియర్‌కు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుంది. అయితే ఒకేసారి కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించడం కంటే ఒక్కో ఉత్పత్తిని క్రమంగా రొటీన్‌లో చేర్చుకోవడం మంచిది. కొత్త సీరమ్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం కూడా ముఖ్యమే.

Also Read : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.