BMW F 450 GS Price & Variants: బీఎండబ్ల్యూ, తన GS అడ్వెంచర్ బైక్ ఫ్యామిలీలోకి కొత్తగా F 450 GSను తీసుకొచ్చింది. GS రేంజ్‌లో ఇది ఎంట్రీ లెవల్ మోడల్‌గా నిలుస్తుంది. గతంలో అందుబాటులో ఉన్న G 310 GS స్థానంలోకి ఈ కొత్త బైక్ వచ్చింది. ఈ మోడల్‌ను భారత్‌లోని TVS హోసూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.

Continues below advertisement

BMW F 450 GS మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి Base, Exclusive, Sport & GS Trophy. ఒక్కో వేరియంట్‌కు వెళ్లే కొద్దీ అదనపు ఫీచర్లు, ఎక్విప్‌మెంట్‌ లభిస్తాయి. అయితే అన్ని వేరియంట్లలోనూ ఇంజిన్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇందులో 420cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ 48hp పవర్ & 43Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్ వేరియంట్ల ధరలు, వాటి ప్రత్యేకతలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement

 1. Base వేరియంట్

ఎక్స్‌షోరూమ్ ధర: రూ.5.35 లక్షలు

BMW F 450 GS Base వేరియంట్‌లో అవసరమైన ప్రధాన ఫీచర్లను అందించారు. ఇందులో 6.5-అంగుళాల TFT డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్ సదుపాయం, అడ్జస్టబుల్ హ్యాండ్ లివర్లు, హీటెడ్ గ్రిప్స్ & పూర్తి LED లైటింగ్ ఉన్నాయి. ఇందులోని DRL పెద్ద R 1300 GS మోడల్‌ను గుర్తు చేసేలా ఉంటుంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, ముందు భాగంలో 180mm ట్రావెల్‌తో USD ఫోర్క్ ఉంది. వెనుక అడ్జస్టబుల్ స్ప్రింగ్ స్ట్రట్‌ను అందించారు. 19/17-అంగుళాల వీల్ సెటప్ ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్‌లో ABS Pro, ట్రాక్షన్ కంట్రోల్ (DTC), డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC) & ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఉన్నాయి. అడ్జస్టబుల్ ఫ్రంట్ లివర్లు, 20mm వరకు ఎత్తు మార్చుకునే వీలున్న రియర్ బ్రేక్ లివర్ అన్ని వేరియంట్లలోనూ సాధారణంగా ఉంటాయి.

ఈ వేరియంట్ ప్రధానంగా రోడ్డు ప్రయాణాలు, టూరింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. Base మోడల్ కాస్మిక్ బ్లాక్ రంగులో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌

 2. Exclusive వేరియంట్

ఎక్స్‌షోరూమ్ ధర: రూ.5.55 లక్షలు

Base వేరియంట్‌తో పోలిస్తే Exclusive మోడల్‌లో అదనపు రైడర్ ఎయిడ్స్, యూజ్‌ఫుల్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రైడింగ్ మోడ్‌లు & బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను అందించారు. అదనంగా Enduro Pro రైడ్ మోడ్ కూడా ఉంటుంది.

ఇతర మార్పుల్లో క్లియర్ విండ్‌షీల్డ్, బ్లాక్ హ్యాండ్‌గార్డ్స్, ప్లాస్టిక్ ఇంజిన్ గార్డ్ & ఆఫ్‌రోడ్ ఫుట్‌రెస్ట్స్ ఉన్నాయి. ఈ ఫీచర్లతో టూరింగ్‌తో పాటు తేలికపాటి ఆఫ్‌రోడింగ్‌కు కూడా ఈ వేరియంట్ అనుకూలంగా ఉంటుంది.

Exclusive వేరియంట్ కూడా కాస్మిక్ బ్లాక్ రంగులో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.5.55 లక్షలు, Base వేరియంట్ కంటే రూ.20,000 ఎక్కువ.

 3. Sport వేరియంట్

ఎక్స్‌షోరూమ్ ధర: రూ.5.90 లక్షలు

భారత్‌లో చివరిగా విడుదలైన వేరియంట్ Sport. అడ్జస్టబుల్ Sport సస్పెన్షన్ కావాలి, కానీ Easy Ride Clutch (ERC) అవసరం లేదనుకునే వారికి ఈ మోడల్ అందుబాటులో ఉంది.

Sport వేరియంట్‌లో Exclusive మోడల్‌తో పోలిస్తే సస్పెన్షన్ సెటప్ & రంగు మినహా అదనపు ఫీచర్లు లేవు. ఇది రేసింగ్ రెడ్ రంగులో మాత్రమే లభిస్తుంది.

దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.90 లక్షలు. Exclusive వేరియంట్‌తో పోలిస్తే రూ.35,000 ఎక్కువ చెల్లించాలి.

ఇది కూడా చదవండి: Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?

 4. GS Trophy వేరియంట్

ఎక్స్‌షోరూమ్ ధర: రూ.6.15 లక్షలు

BMW F 450 GS శ్రేణిలో టాప్ వేరియంట్ GS Trophy. ఈ మోడల్‌ను ప్రధానంగా ఆఫ్‌రోడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో Sport సస్పెన్షన్ సెటప్, అల్యూమినియం ఇంజిన్ గార్డ్ & ఈజీ రైడ్‌ క్లచ్‌ (ERC) స్టాండర్డ్‌గా లభిస్తాయి. ERC అనేది సెంట్రిఫ్యూగల్ క్లచ్. దీని వల్ల రైడర్ క్లచ్‌ను చేతితో ఆపరేట్ చేయకుండానే బైక్‌ను ఆపి, మళ్లీ ముందుకు కదిలించవచ్చు. ఇది తక్కువ వేగంలో బైక్ నడపడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

ఈ వేరియంట్‌లో టింటెడ్ ర్యాలీ స్టైల్ విండ్‌షీల్డ్, వైట్ హ్యాండ్‌గార్డ్స్ & వైట్ మెయిన్ ఫ్రేమ్ ఉన్నాయి. ప్రత్యేకమైన రేసింగ్ బ్లూ మెటాలిక్ రంగులో లభిస్తుంది.

GS Trophy ధర రూ.6.15 లక్షలు. Sport వేరియంట్ కంటే రూ.25,000, Exclusive కంటే రూ.60,000, Base వేరియంట్ కంటే రూ.80,000 ఎక్కువ.

 ఏ వేరియంట్ ఎవరికి అనుకూలం?

BMW F 450 GS Base వేరియంట్‌లో ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. రోడ్డు ప్రయాణాలు & టూరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు దీన్ని పరిశీలించవచ్చు. అదనపు రైడింగ్ మోడ్‌లు, క్విక్‌షిఫ్టర్ కావాలనుకునేవారికి Exclusive వేరియంట్ ఉపయోగపడుతుంది.

అడ్జస్టబుల్ Sport సస్పెన్షన్ కావాలి, కానీ ERC అవసరం లేదనుకునేవారు Sport మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఆఫ్‌రోడింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి GS Trophy వేరియంట్‌లోని అదనపు పరికరాలు ఉపయోగపడతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.