Too Much Water Can Be Dangerous in Summer : వేసవికాలం(Summer 2026)లో చెమటలు ఎక్కువగా పడుతాయి. దీంతో శరీరం నీటిని త్వరగా కోల్పోతుంది. అందుకే చాలామంది ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి అలవాటే. కానీ అవసరానికి మించి నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెప్తున్నారు. మరి సమ్మర్‌లో ఎంత నీళ్లు తాగాలి? ఎంత తాగితే అది ఎక్కువ అవుతుంది? సరైన హైడ్రేషన్ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు ఎక్కువ తాగుతున్నామని ఎలా తెలుసుకోవాలి?
సాధారణంగా రోజుకు 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు సరిపోతాయి. కానీ ఇది వ్యక్తి శరీరం, వాతావరణం, యాక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా తక్కువ సమయంలో 4–5 లీటర్లకు మించి తాగితే water intoxication వచ్చే అవకాశం ఉంది. చాలామంది తెలియక ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగేస్తారు. ఇది కూడా ప్రమాదమేనని చెప్తున్నారు నిపుణులు.
ఎక్కువ నీళ్లు తాగితే వచ్చే సమస్యలు
ఎక్కువ నీళ్లు తాగితే శరీరంలో కొన్ని సమస్యలు వస్తాయి. సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, శరీరంలో సోడియం స్థాయి తగ్గడం వల్ల Hyponatremia అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అధికంగా నీళ్లు తాగితే తల తిరగడం, వాంతులు, అలసట కలగవచ్చు. తరచూ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. కండరాలు బలహీనంగా మారి.. ప్రమాదకరం కావచ్చు.
మరి సమ్మర్లో 2.5 నుంచి 3.5 వరకు నీటిని తాగితే సరిపోతుందా? హైడ్రేషన్ కోసం ఏ టిప్స్ ఫాలో అవ్వాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. అలాంటప్పుడు హైడ్రేషన్ కోసం మంచి ప్లానింగ్ ఫాలో అవ్వాలి.
హైడ్రేషన్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్
బలవంతంగా లీటర్ల కొద్దీ నీటిని తాగాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని తక్కువగా తీసుకున్నా.. వాటర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీరు వంటివి బెస్ట్ ఆప్షన్. ఇవి శరీరాన్ని కూల్‌గా ఉంచుతాయి. చెమటలు ఎక్కువగా పడితే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించాలి. ఆ సమయంలో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపిన నీరు తాగవచ్చు. ఒక్కసారిగా ఎక్కువగా కాకుండా రోజంతా కొంచెం కొంచెంగా తాగితే మంచిది. అలాగే బయటికి వెళ్లే ముందు నీళ్లు తాగండి. లేదంటే ఎండలోకి వెళ్లినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.
వేసవిలో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అలా అని ఎక్కువ తాగితే మంచిదనుకోవడం తప్పు. అవసరానికి మించి నీళ్లు తాగితే కూడా సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి. అలాగే శరీరానికి అనుగుణంగా నీళ్లు అందించాలి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
