Health Tips In Telugu: కొన్ని రకాల డ్రింక్స్ తీసుకునే పురుషులకు జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.ప్రతి నిత్యం ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీలు తాగేవారిలో జుట్టు రాలడం 30 శాతం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు గురించారట. దీనికి సంబంధించి బీజింగ్ లోని సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకు ఒక అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు న్యూట్రియెంట్స్ జర్నల్ లో ప్రస్తావించారు.


కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా నీళ్లు, స్పోర్ట్స డ్రింక్స్ వంటి ఎక్కువ చక్కెరలు కలిగి పానీయాలు తరచుగా తీసుకునే పురుషుల్లో జుట్టు రాలడం ఎక్కవగా ఉన్నట్టు గుర్తించారట. ఇటువంటి పానీయాలు అసలు తాగని వారితో పోలిస్తే రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఈ తియ్యని పానీయాలు తాగేవారిలో జుట్టు రాటడం 42 శాతం వరకు ఎక్కువగా ఉందని అంటున్నారు. జుట్టు ఎక్కువగా రాలుతోందని కంప్లైంట్ చేసే పురుషులు వారానికి కనీసం 12 డ్రింక్స్ తీసుకుంటున్నారట. అదే వారానికి 7 డ్రింక్స్ వరకు తీసుకుంటున్నా వారిలో ఈ సమస్య కాస్త తక్కువే ఉందట.


ఈ అధ్యయనం కోసం 18 నుంచి 45 మధ్య వయసున్న  వెయ్యి మందికి పైగా చైనీస్ పురుషుల అలవాట్లను పరిశీలించారు. వారి ఆహారపు అలవాట్లు, ఇతర మానసిక, శారీరక ఆరోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. జుట్టు రాలడంలో కేవలం పానీయాలను మాత్రమే తప్పు పట్టలేమని కూడా అంటున్నారు. ఫాస్ట్ ఫూడ్ ఎక్కువగా, కూరగాయలు తక్కువగా తినే పురుషుల్లో జుట్టురాలే ప్రమాదం ఎక్కువని ఇక్కడి నిపుణులు అంటున్నారు.


మానసిక సమస్యలు ఉన్నవారిలో జుట్టు రాలేప్రమాదం ఎక్కువ 
అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్నవారిలో కూడా జుట్టు రాలేప్రమాదం ఎక్కువగానే ఉంటుందట. సమతుల ఆహారం తీసుకోవడం జుట్టు రాలడం నివారించాలంటే దగ్గరి దారి అని ఈ పరిశోధన సారాంశం. శరీరంలో వేగంగా విభజన చెందే కణాల్లో హెయిర్ ఫోలికిల్ కణాలు రెండవ స్థానంలో ఉన్నాయి. వీటికి సమతుల ఆహారం, అన్ని రకాల పోషకాలు తప్పనిసరిగా అవసర మని లండన్ కు చెందిన చర్మ డెర్మటాలజిస్ట్ డాక్టర్ షారన్ వాంగ్ అంటున్నారు. ఈ పోషకాలలో లీన్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటిమన్స్, మినరల్స్ ఇలా అన్ని రకాల సూక్ష్మ, స్థూల పోషకాలు తప్పకుండా ఉండాలి. అయితే జుట్టు ముఖ్యమైన అవయవం కాదు కనుక చాలామంది జుట్టు పెరుగుదల గురించి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. అయితే బరువు తగ్గేందుకు చేసే డైట్లు, పోషకాహార లోపాలు జుట్టు పలుచబడేందుకు ముఖ్యమైన కారణాలు.


జుట్టు రోజు కొంత రాలడం సహజమే. ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకల వరకు రాలిపోవడాన్ని గురించి ఆందోళన పడే పనిలేదు. కానీ అంతకు మించి జట్టు రాలుతుండడం మరేదైనా అనారోగ్య సూచన కావచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా జుట్టు రాలడం మొదలైనా, తక్కువ సమయంలోనే మాడు మీద జుట్టు పలుచబడుతున్నట్టు గమనించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అనేది వారి సలహా.


Also read: పాన్ నమిలాక తినకూడని ఆరు ఆహార పదార్థాలు ఇవే




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.