బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ, కాపుచ్చినో విన్నారు కానీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి మీకు తెలుసా? ఇప్పుడు ఎక్కడ చూసిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ట్రెండ్ నడుస్తోంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కాఫీ కీటో డైట్. కాఫీలో నెయ్యి కలపడం వల్ల ఇది బుల్లెట్ ప్రూఫ్ కాఫీగా మారింది. కరోనా మహమ్మారి సమయంలో ఇది బాగా ట్రెండ్ అయ్యింది.


కాఫీ, నెయ్యి కలిపితే బరువు తగ్గుతారా?


ఇదొక కార్బోహైడ్రేట్ అల్పాహారం. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా చేయకుండా బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ తాగితే చాలు పొట్టనిండుగా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ శరీరానికి పూర్తి శక్తిని అందిస్తుంది. నెయ్యి జీర్ణక్రియని నెమ్మదించేలా చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నెయ్యిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచిదేనని చెప్తున్నారు.


బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల ప్రయోజనాలు


పేగులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది


బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తిన్నప్పుడు ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం లేదా జీవక్రియ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ కాఫీ మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.


ఆందోళన తగ్గిస్తుంది


కెఫీన్ ఆందోళన స్థాయిలను పెంచుతుంది. కానీ కొద్దిగా కొవ్వుతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ దీనికి పూర్తి విరుద్ధంగా పని చేస్తుంది. నెయ్యితో చేసిన కాఫీ మహిళలకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవాళ్ళు ఈ కాఫీ తాగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు.


జీర్ణక్రియ మెరుగు


నెయ్యి జీర్ణక్రియను నియంత్రిస్తుంది. యాసిడ్ రీఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉంటే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. శరీరంలో ఇప్పటికే పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తుంది. పాల అలర్జీ ఉన్న వాళ్ళు నెయ్యి వేసిన కాఫీ తీసుకుంటే మంచి ప్రత్యామ్నాయం.


బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ ఎలా తాగాలి?


బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు పొందాలంటే ఎప్పుడు ఖాళీ కడుపుతోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి అవసరమైన జీవక్రియని వేగవంతం చేస్తుంది. శరీరానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తుంది.


వ్యాయామానికి ముందు దీన్ని తీసుకుంటే మంచిది. అయితే ఈ కాఫీని రెండు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతకమించి ఎక్కువ తాగితే మాత్రం బరువు పెరుగుతారు. అంతే కాదు నిద్రవిధానాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Aslo read: రోజూ జస్ట్ 15 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టండి - ఈ అద్భుతాలు చూస్తారు!