ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న కనిపిస్తున్న పండు డ్రాగన్ ఫ్రూట్. ఎన్నో పోషకాలు అందించే ఈ ఫ్రూట్ ని తినడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. మధుమేహులు, గర్భిణీలకు ఇది ఎంతో మంచి పండు. చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికి లోపల మాత్రం ఎర్రగా ఉంటుంది. అందులోని సన్నని విత్తనాలు చూసేందుకు సబ్జా గింజలని పోలి ఉంటాయి. చాలా మంది ఈ ఫ్రూట్ తినేందుకు త్వరగా ఆసక్తి చూపించారు. కానీ దీని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి అద్భుతమైన పండు ఇది.


సాధారణంగా మధుమేహులు తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైనా పండ్లు తినాలంటే ఆలోచిస్తారు. కానీ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ నిరభ్యంతరంగా తినేయొచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో ఇది సూపర్ ఫ్రూట్ గా నిపుణులే కాదు క్లినికల్ అధ్యయనాలు కూడ చెప్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలి 24% తగ్గినట్టుగా పరిశోధకులు గుర్తించారు.


మధుమేహులు రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుకోవడానికి మందుల మీద ఆధారపడతారు. వాటికి బదులుగా ఆహార ఉత్పత్తులు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇటీవల వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ తో బాధపడే వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే దాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాలు నిర్వహించారు. జంతువులూయ మీద చేసిన అధ్యయనాల్లో ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ కణాల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్టు తేలింది.


నాలుగు గ్రూపుల మీద ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొదటి గ్రూపులో వాళ్ళకి రోజుకు 400 గ్రాముల రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చారు. నాలుగో గ్రూప్ కి రోజుకి 600 గ్రాముల పండు అందించారు. గ్రూప్ వన్ లో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న వారలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో 24 శాతం మార్పులు గమనించినట్టు వెల్లడించారు. డ్రాగన్‌ఫ్రూట్లో లైకోపీన్, బి కెరోటిన్, బీటాసైనిన్‌తో సహా అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి.


రెడ్ డ్రాగన్ ఫ్రూట్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఫైబర్, ఫాస్పరస్, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉన్నాయని బోర్నియో సైన్స్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఉండే యాంటీ ట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి గుణాలు రోగాలను నయం చేసేందుకు సహకరిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో కెరోటినాయిడ్స్ ఉండటం వల్ల శరీరంలో ఉండే ప్రాణాంతక కణాలను చంపడం ద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొంది. డయాబెటిస్‌కు సంబంధించిన అనేక సమస్యలు రక్తంలో చక్కెర స్థాయిల్లో నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మీ పిల్లల ముందు ఇలా చేస్తున్నారా? దాని ఫలితం మీరు ఊహించలేరు


Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు