వర్షం పడేటప్పుడు లేదా పడటానికి ముందు ఒక్కోసారి భయంకరంగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పిడుగులు కూడా పడతాయి. ఉరిమేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు అంటారు. ఎందుకంటే పిడుగులు ఎక్కువగా చెట్ల మీద పడతాయి. వాటి వల్ల మరణం సంభవిస్తుందని చెప్తారు. ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఎక్కువగా ఉరుములు, మెరుపులు, టోర్నడోలు వస్తాయి. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా చెక్కతో చేసే ఇళ్ళనే నిర్మించుకుంటారు. టోర్నడోల కారణంగా వచ్చి భీకరమైన గాలికి ఎంతటి బలమైన వస్తువులైనా కొట్టుకుపోతాయి. ఉరుముల వల్ల వచ్చే మరణాలు కూడా ఫ్లోరిడా, టెక్సాస్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఏడాదికి 180 మంది వ్యక్తులు పిడుగుపాటుకి గురవుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం పిడుగుపాటుకు గురైన వారిలో 10 శాతం మంది మరణిస్తున్నారు.
ఫ్లోరిడాలోనే ఎక్కువ ఉరుముల వర్షం ఎందుకు పడుతుందో తెలుసా?
యూఎస్ నేషనల్ వేదర్ సర్వీసెస్ ప్రకారం గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ మహాసముద్ర నుంచి వెచ్చని, తేమతో కూడిన గాలులు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షాన్ని పడేలా చేస్తాయి. అందుకే ఉరిమే సమయంలో నీటికి పూర్తిగా దూరంగా ఉండాలని చెప్తారు. స్నానం చేయడం, పాత్రలు కడకటం, చేతులు నీటితో శుభ్రం చేసుకోవడం చేయకూడదని చెబుతారు.
ఉరుములు, మెరుపుల టైంలో ఇవి చెయ్యకూడదు
ప్లంబింగ్ ద్వారా మెరుపులు ప్రయాణిస్తాయి. ఇవి ప్లాస్టిక్ వస్తువుల మీద తక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ఇంటి బాల్కనీ, కిటికీ, తలుపుల దగ్గర కూడా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మెరుపుల వల్ల వచ్చే కాంతి కంట్లో పడటం వల్ల కంటి చూపు పోతుందని కూడా చెప్తారు. మెటల్ మీద మెరుపులు, ఉరుముల ప్రభావం ఎక్కువగా పడుతుంది. అందుకే అటువంటి సమయంలో కాంక్రీటు గోడలకు అనుకుని ఉండొద్దని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు దూరంగా ఉంచాలి
ఇదే కాదు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండాలి. అవి మెరుపులని ఆకర్షించే శక్తి వాటికి ఎక్కువగా ఉంటుంది. ఫోన్ మాట్లాడటం, ఛార్జింగ్ పట్టుకోవడం కూడ చెయ్యకూడదు. మెరుపు విద్యుత్ కనెక్షన్స్, రేడియో, టెలివిజన్ సిస్టమ్, కాంక్రీట్ గోడలు లేదా ఫ్లోరింగ్‌లోని ఏదైనా మెటల్ వైర్లు లేదా బార్ల ద్వారా ప్రయాణించవచ్చు.
ఉరుముల నుంచి రక్షణగా
గృహోపకరణాలను రక్షించడానికి ఇంటిని మొత్తం హౌస్ సర్జ్ ప్రొటెక్టర్లు అమర్చుకోవచ్చు. టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి స్టెబిలైజర్ ని ఫిట్ చేసుకోవచ్చు. మెరుపుల నుంచి ఇంటిని రక్షించుకోవడం కోసం ఎర్త్ వైర్ రాడ్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అది మెరుపు ఇంట్లోని వస్తువులని చేరకుండా చేస్తుంది.
సెల్ఫీలు వద్దే వద్దు
చాలా మంది మెరుపులు వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడతారు. కానీ అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కాంక్రీటుతో తయారు చేసిన కిటికీలు, తలుపుల దగ్గర ఉండకూడదు. ముళ్ల కంచెలు, విద్యుత్ లైన్లు, గాలిమరలు, టెలిఫోన్ స్తంభాలు, చెట్లు వంటివి వాటిని ఎత్తైన వస్తువును మెరుపులు త్వరగా తాకుతాయి. ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తే మెరుపుల ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా బయటపడొచ్చు.
Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే
Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!