Sunscreen Affects Vitamin D : చర్మ సంరక్షణలో భాగంగా మగవారు, ఆడవారు కూడా సన్‌స్క్రీన్‌ని అప్లై చేస్తూ ఉంటారు. ఇది స్కిన్‌ని డ్యామేజ్ కాకుండా రక్షణ అందిస్తుంది. సన్‌బర్న్, వృద్ధాప్యఛాయలు, ముడతలు, స్కిన్ క్యాన్సర్ వంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని ఎక్కువమంది ఉపయోగిస్తారు. మేకప్ ఉపయోగించనివారు కూడా దీనిని వినియోగిస్తారు. అయితే ఈ సన్స్క్రీన్లు సూర్యకిరణాల ప్రభావాన్ని అడ్డుకోవడంతో పాటు విటమిన్ డిని కూడా శరీరానికి అందకుండా చేస్తుందా?
విటమిన్ డి ఎందుకు ముఖ్యమంటే..
విటమిన్ డి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యంతో పాటు, దంత సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాల్షియాన్ని శరీరం తీసుకునేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. మూడ్ స్వింగ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అయితే మిగిలిన విటమిన్స్ అన్నింటిని ఫుడ్ నుంచి అందుకోవచ్చు. కానీ విటమిన్ డి ఫుడ్ సోర్స్‌లు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో పొందాలంటే సూర్యరశ్మినే అవసరం. అయితే చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే సన్‌స్క్రీన్ ఈ విటమిన్ డిని కూడా అడ్డుకుంటుందా? అసలు సన్‌స్క్రీన్ ఎలా పని చేస్తుంది? వంటి విషయాలు చూసేద్దాం.
సన్‌స్క్రీన్ ఎలా పని చేస్తుందంటే..
సన్స్క్రీన్లు చర్మానికి హాని చేసే UV కిరణాలను నిరోధించడానికి హెల్ప్ చేస్తాయి. చర్మం విటమిన్ డిని తయారు చేయడానికి హెల్ప్ చేసే UVB కిరణాలను కూడా ఉంటాయి.. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. అదేంటంటే సాధారణంగా సన్‌స్క్రీన్‌లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఎక్కువగా ఉంటే చర్మానికి చాలా మంచిది. అందుకే చాలామంది SPF ఎక్కువగా ఉండే సన్‌స్క్రీన్‌ని ఎంచుకుంటారు. కానీ సమస్య ఏంటి అంటే.. SPF ఎంత ఎక్కువగా ఉంటే.. అది UVB కిరణాలను చర్మం తీసుకునే అవకాశం తగ్గుతుంది.
SPF 30 సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే చర్మం విటమిన్ డిని తీసుకునే అవకాశం 97 శాతం ఉంటుంది. అదే SPF 50 అప్లై చేస్తే 98 శాతం. దీని ప్రకారం సన్‌స్క్రీన్ నిజంగానే విటమిన్ డిని నిరోధిస్తుంది. కానీ 100 శాతం కాదు. విటమిన్ డి ఉత్పత్తిని పెంచే UVB కిరణాలను తగ్గిస్తుంది. దీనివల్ల విటమిన్ డి శరీరానికి అందడం తగ్గుతుంది.
నిపుణులు ఏమి చెప్తున్నారంటే..
సన్‌స్క్రీన్ వాడడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడదని పలువురు డెర్మటాలజిస్ట్‌లు చెప్తున్నారు. ఎందుకంటే కొందరు సన్‌స్క్రీన్‌ను సరిగ్గా అప్లై చేయరని లేదా UVB కిరణాలను నిరోధించేంత ఎక్కువ సార్లు మళ్లీ అప్లై చేయరు కాబట్టి.. శరీరానికి కొంత విటమిన్ డి లభిస్తుందని చెప్తున్నారు. చాలామంది ముఖానికి, చేతులకు మాత్రమే సన్‌స్క్రీన్ అప్లై చేస్తారని.. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. రోజూ కాసేపు ఎండలో ఉంటూ.. మంచి ఫుడ్, సప్లిమెంట్ల ద్వారా శరీరానికి తగినంత విటమిన్ డిని పొందవచ్చని చెప్తున్నారు.
విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ మానేయాలా?
విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ మానేయాలా అంటే అస్సలు మానవద్దని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ డి కంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదమే ఎక్కువని అంటున్నారు. కాబట్టి సన్‌స్క్రీన్ ఉపయోగించడం మానవద్దని చెప్తున్నారు.
విటమిన్ డి కోసం ఏమి చేయాలంటే..
వారంలో కొన్ని రోజులు సన్‌స్క్రీన్ లేకుండా 10 నుంచి 20 నిమిషాలు టైమ్ స్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. విటమిన్ డి కోసం గుడ్లు, మష్రూమ్స్, ఫ్యాటీ ఫిష్ డైట్లో చేర్చుకోవాలంటున్నారు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వైద్యుల సహాయంతో తీసుకోవచ్చు. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకుండా విటమిన్ డి కోసం వీటిని ఫాలో అయిపోవాలని సూచిస్తున్నారు.