గాయాల్లాంటి శారీరక సమస్యలు కంటికి కనిపిస్తాయి. చూసి తెలుసుకోగలం కానీ మానసిన సమస్యలను తెలుకోవడం చాలా కష్టం. కొంతమంది సాధారణంగానే కనిపిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఐర్లాండ్ దేశానికి ఒక మహిళ కూడా ఇలానే ఉంటుంది.  అందరిలో ఉన్నప్పుడు అత్యంత సాధారణ స్త్రీగా కనిపిస్తుంది. కానీ ఆమె ముందు చిన్న బ్యాటరీలు పెట్టి చూడండి, ఆమెలోని ఒక విచిత్ర మనిషి బయటికి వస్తుంది. ఆ బ్యాటరీ ఎలాగోలా దొంగిలించేస్తుంది. ఆ బ్యాటరీలను మింగేస్తుంది. అలా ఒకటి రెండు కాదు ఏకంగా 55 బ్యాటరీలను మింగేసింది. వాటి బరువు పొట్ట సాగిపోయింది కూడా. తనకు తాను హాని చేసుకోవాలని కావాలనే ఆమె ఈ పనిచేసిందని చెబుతున్నారు వైద్యులు. 


పొట్ట నొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళకు స్కాన్ చేసి చూశారు వైద్యులు. అందులో చాలా స్థూపాకార బ్యాటరీలు కనిపించాయి. స్కాన్ లో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం కూడా కష్టమైంది. వాటిలో చాలా మటుకు ఆమె పొత్తి కడుపులో చిక్కుకున్నట్టు కనిపించింది.  ఆ బ్యాటరీల సహజంగా మల విసర్జన ద్వారా బయటికి పంపేందుకు ప్రయత్నించారు. ఆ విధంగా కేవలం అయిదు బ్యాటరీలు మాత్రమే తీయగలిగారు.బ్యాటరీల బరువు జఘన ఎముకపై పడి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


దీంతో పొట్టపై చిన్న రంధ్రం చేసి వాటిని బయటికి తీశారు. మొత్తం 55 బ్యాటరీలు ఉన్నాయి. వైద్యులు వాటిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇన్ని బ్యాటరీలు మింగిన మొదటి వ్యక్తి ఈమెనని అన్నారు.అయితే ఈ ఎలక్ట్రోకెమికల్ పరికరాలు ఆమె జీర్ణకోశ వ్యవస్థను డామేజ్ చేయకపోవడం గమనార్హం. ఆమె శరీరానికి ఏమాత్రం నష్టం కలిగించకపోవడం మంచిదే అయిందని అభిప్రాయపడ్డారు వైద్యులు. ఇలా ఆహారం కాకుండా ఇతర వస్తువులను పొట్టలోకి వెళ్లేలా చేసుకుంటున్న కేసులు కనిపిస్తున్నాయి. జూలైలో జోధ్‌పూర్లోని వైద్యులు 63 మెటాలిక్ నాణాలను ఒక వ్యక్తి పొట్టలోంచి తొలగించారు.  మొన్ననే మరొక వ్యక్తి పొట్టలోంచి ఏకంగా డియోడరెంట్ బాటిల్ ను బయటికి తీశారు. ఏదైనా పొట్టలోకి వెళ్లిందని తెలిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ఉత్తమం. పొట్టనొప్పి వచ్చే వరకు వెయిట్ చేయకూడదు.






Also read: రోజుకో కప్పు కాఫీ తాగితే అకాల మరణ ప్రమాదం తగ్గుతుందా? జీవితకాలం పెరుగుతుందా?


Also read: చెట్టు పాలతో తయారయ్యే పచ్చ కర్పూరం, ఇక హారతి కర్పూరం కథ మాత్రం వేరు