Doctors Remove 16 Inch Bottle Guard From Mans Rectum: అరుదైన ఆపరేషన్లు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తాయి. కడుపులో నుంచి వెంట్రుకలు తీయడం చూసి ఉంటాం. కొన్నిసార్లు కీ చైన్లు కూడా బయటకు తీయడం చూశాం. కడుపులో నుంచి రకరకాల వ్యాధికారక గడ్డలను తీసిన సందర్భాలూ ఉన్నాయి. బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేయడం చూశాం. కానీ, కడుపులో నుంచి సొరకాయ తీయడం ఎప్పుడైనా చూశారా? కడుపులో నుంచి సొరకాయ తీయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది ముమ్మాటికీ నిజం. డాక్టర్లు ఓ మనిషి కడుపులో నుంచి 16 అంగుళాల సొరకాయను బయటకు తీశారు. పురీషనాళం భాగంలో ఉన్న ఈ సొరకాయను తొలగించారు.


కడుపునొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన వృద్ధుడు


కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో 60 ఏళ్ల వృద్ధుడు హాస్పిటల్ కు వెళ్లాడు. కడుపు నొప్పి వస్తుందంటూ అక్కడి డాక్టర్లు చెప్పాడు. తొలుత సాధారణ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చివరకు ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రేలో ఏదో వింత వస్తువు కనిపించింది. పురీషనాళంలో ఆకుపచ్చ రంగులో సొరకాయ లాంటి ఆకారం కనిపించింది. మొదట అది ఒకరకమైన గడ్డ కావచ్చు అని భావించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అదే విషయాన్ని సదరు వ్యక్తికి చెప్పి, ఆపరేషన్ కు ఒప్పించారు.  డాక్టర్ సంజయ్ మౌర్య, నందకిశోర్, మనోజ్ చౌదరి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆ వృద్ధుడికి ఆపరేషన్ చేశారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. అయితే, పురీషనాళంలో సొరకాయను చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.


ఇంతకీ అతడి కడుపులో నుంచి తీసింది సొరకాయేనా?


మరోవైపు అసలు పురీష నాళంలోకి సొరకాయ ఎలా వెళ్లింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిజానికి వృద్ధుడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు. అయితే, కావాలనే సదరు వ్యక్తి మింగినట్లు భావిస్తున్నారు. మరోవైపు అసలు వృద్ధుడి కలుపులో నుంచి తీసింది సొరకాయా? కాదా? అని మరికొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ డాక్టర్లు పాపులారిటీ కోసమే ఇలా చేస్తున్నారేమో అంటున్నారు. వాస్తవాలని ఆధారాలతో సహా బయట పెట్టాలని కోరుతున్నారు. అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. అటు వృద్ధుడు కడుపులో నుంచి తీసిన వస్తువుపై లోతుగా పరిశోధన చేస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.  ప్రస్తుతం వృద్ధుడు నిద్ర మత్తులోనే ఉన్నారని, ఆయన సృహలోకి వస్తే తప్ప, అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని తెలిపారు.  అయితే, సదరు వ్యక్తికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.


Read Also: వామ్మో, కంటి లోపల ఇలాంటి గాయాలు కూడా ఏర్పడతాయా? సీరియల్ నటికి నరకం చూపిన కార్నియల్ డ్యామేజ్ - అసలు ఏంటిది?



Read Also: మూర్ఛవస్తే ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి.. సమస్యను దూరం చేసేందుకు ఈ టిప్స్​ను ఫాలో అయిపోండి