ఫిబ్రవరి అంటేనే ప్రేమికులకు పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ నెలలో ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీనిని చాలా మంది ప్రేమ పండుగగా పిలుస్తారు. ఈ వాలెంటైన్స్ డేని వారానికోసారి వివిధ రకాలుగా వారమంతా సెలవు దినంగా జరుపుకుంటారు. ఈ వారంలో నాల్గవ రోజు టెడ్డీ డేగా జరుపుకుంటారు. అమ్మాయిలు బాగా ఇష్టపడే టెడ్డీలను తమ లవర్స్ బహుమతిగా ఇస్తుంటారు. ఈ టెడ్డీ డేని తమ భాగస్వామిపై వారి భావాలను వ్యక్తపరచడానికి జరుపుకుంటారు. మీరు మీ స్నేహితురాలిని ఇంప్రెస్ చేయాలనుకుంటే లేదా మీరు ఇష్టపడే వారిపై మీ ప్రేమను చూపించాలనుకుంటే, వారికీ టెడ్డీని గిఫ్ట్‌గా ఇవ్వండి. వాలెంటైన్స్ వారంలోని ఈ ప్రత్యేకమైన రోజున, ఆమె హృదయాన్ని గెలుచుకోవడానికి, ఈ అద్భుతమైన రోజును జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడానికి ఆమెకు ఇష్టమైన రంగులో టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వండి. 


‘టెడ్డీ డే’ ఎప్పుడు జరుపుకుంటారు? 


ప్రతి ఏడాది ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డే రోజును ప్రేమికులు సంతోషంగా  జరుపుకుంటారు. ఈ సంవత్సరం టెడ్డీ డే శనివారం వచ్చింది. అమ్మాయిలు బాగా ఇష్టపడే గిఫ్ట్ లలో టెడ్డీ బేర్ కూడా ఒకటి. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, సంబంధానికి ప్రతీకగా టెడ్డీ బేర్స్ రోజు జరుపుకుంటారు. US మాజీ అధ్యక్షుడు థియోడర్ టెడ్డీ రూజ్‌వెల్ట్ వల్లే ‘టెడ్డీ’ పుట్టిందని అంటుంటారు. 


అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ఓ సారి అడవికి వెళ్లారు. ఆయన మెప్పు పొందేందుకు సహాయకులు ఓ ఎలుగు బంటి పిల్లను ట్రాప్ చేసి పట్టుకున్నారు. దాన్ని చెట్టుకు కట్టేశారు. దాన్ని షూట్ చేయాలని అధ్యక్షుడిని కోరారు. అయితే, ఆ ఎలుగుబంటిని చూసి.. అధ్యక్షుడు జాలి చూపించాడు. దాన్ని వదిలిపెట్టాలని కోరాడు. ఓ కార్టునిస్టు గీసిన చిత్రం వల్ల ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన గురించి తెలుసుకుని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని మిఠాయి దుకాణం యజమాని మోరిస్ మిచ్‌టామ్ అధ్యక్షుడికి స్టఫ్డ్ టాయ్ బేర్‌ను అంకితం చేశాడు. దానికి టెడ్డీ బేర్ అని పేరు పెట్టాడు.


ఎరుపు టెడ్డీ బేర్ 


ఎరుపు టెడ్డీ బేర్ అభిరుచి, ప్రేమను సూచిస్తుంది. ఇది వారి మధ్య అనుబంధాన్ని, భావోద్వేగాలను సూచిస్తుంది.


పింక్ టెడ్డీ బేర్


ఈ రోజు మీరు మీ లవర్‌కు పింక్ టెడ్డీ బేర్ ఇవ్వడం లేదా తీసుకున్నా.. మీ ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు లేదా ప్రేమను అంగీకరిస్తున్నట్లు అర్థం. 


బ్లూ టెడ్డీ బేర్


ఈ రోజు బ్లూ టెడ్డీ బేర్ బలం, జ్ఞానం అంకితభావాన్ని సూచిస్తుంది. ఈ రోజు మీకు నీలి రంగు టెడ్డీ బేర్ ఇస్తే, మీ ప్రేమ నిజంగా బలంగా ఉందని, మీరు మీ సంబంధానికి కట్టుబడి ఉన్నారని అర్థం.


గ్రీన్ టెడ్డీ బేర్


ఆకుపచ్చ టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇచ్చినప్పుడు, అతను తన ప్రియమైన వ్యక్తితో బలమైన సంబంధాన్ని కోరుకోవడమే కాకుండా, అతను తన ప్రియమైన వ్యక్తి కోసం వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడని కూడా సూచిస్తుంది.


 ఆరెంజ్ టెడ్డీ బేర్‌


ఈ రోజు ఆరెంజ్ రంగు టెడ్డీ బేర్‌.. ఆనందం, ఆశ, కాంతిగా చిహ్నంగా భావిస్తారు. కాబట్టి.. మీరు మీ లవర్‌కు ఏ కలర్ టెడ్డీ బేర్ ఇవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. 


Also Read : బరువు తగ్గాలంటే ఈ ఫ్రూట్స్ తినాలంటున్న నిపుణులు, ఎందుకంటే?