Fruits for weight loss : వివిధ ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఫిట్​గా, హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. వ్యాయామాలు, యోగా, జిమ్ వంటి వాటిని చేస్తూ ఉంటారు. ఇవి రెగ్యూలర్​గా చేస్తే బరువును అదుపులో పెట్టుకోవచ్చు. కానీ బరువు తగ్గడంలో వ్యాయామాలతో పాటు ఫుడ్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకున్నప్పుడు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.


బరువు తగ్గడంలో ఫ్రూట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి అంటున్నారు డైటీషియన్లు. ఇవి శరీరంలోని అదనపు కిలోలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే అన్ని పండ్లు బరువు తగ్గేందుకు సహాయపడతాయా అంటే మాత్రం నో అంటున్నారు నిపుణులు. కొన్ని పండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకే బరువు తగ్గడంలో హెల్ప్ చేసే ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకోవాలి అంటున్నారు. ఈ ఫ్రూట్స్ తింటే వెయిట్​లాస్​కి చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. 


యాపిల్స్


యాపిల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది మీరు ప్రతిరోజూ తినగలిగే పండు. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి మీరు బరువుతగ్గాలని చూస్తున్నట్లయితే.. యాపిల్స్ మంచి ఎంపిక అంటున్నారు. అంతేకాకుండా వీటిని మీరు రెగ్యూలర్​గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మీరు వాటిని నేరుగా తీసుకోవచ్చు లేదా సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు. 


బెర్రీలు


బరువు తగ్గాలంటే బెర్రీలు తినాలట. ఎందుకంటే వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అన్ని రకాల బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాని న్యూట్రిషియన్లు చెప్తున్నారు. ఒక కప్పు స్ట్రాబెర్రీలలో 50 కేలరీల కంటే తక్కువ ఉంటాయి అంటున్నారు. కాబట్టి మీరు బ్రేక్​ఫాస్ట్​ కోసం యోగర్ట్, సలాడ్స్, తృణధాన్యాలు, స్మూతీలలో బెర్రీలు కలిపి తీసుకోవచ్చు. 


నారింజ


నారింజలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఇతర ముఖ్యమైన యాంటీ ఆక్సిండెంట్​లతో ఇవి నిండి ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా నారింజలో కేవలం సుమారు 73 కేలరీలు మాత్రమే ఉంటాయి. 2.8 గ్రాముల ఫైబర్ అందుతుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 


పుచ్చకాయ


పుచ్చకాయల్లో 90 శాతం నీరు ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు దీనిని కచ్చితంగా మీ డైట్​లో కలిపి తీసుకోవచ్చు. పుచ్చకాయను బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్​గా ఉంటుంది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉండే అనుభూతి కలుగుతుంది. 100 గ్రాముల పుచ్చకాయ తీసుకుంటే 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గేందుకు ఇది మంచి ఎంపిక. 


కివి


కివిలో విటిమిన్ సి, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పైగా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు కివినీ నేరుగా తినడం ఇష్టం లేకుండా జ్యూస్​లలో కలిపి లేదా సలాడ్స్​లలో కలిపి తీసుకోవచ్చు. 


రెగ్యూలర్​గా మార్కెట్లలో దొరికే ఈ ఫ్రూట్స్ కచ్చితంగా మీరు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అయితే బరువు తగ్గడానికే కదా అని ఎక్కువ తినకుండా కంట్రోల్​లో తింటే మంచి ఫలితాలు పొందుతారు.


Also Read : ఇంతకీ మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా? క్యాన్సర్ మచ్చలా?