కొంతమందికి కొన్ని ఆహార పదార్థాల అలర్జీ ఉంటుంది. పిల్లల్లో కనిపించే అత్యంత సాధారణ ఆహార అలర్జీలో పాలు కూడా ఒకటి. మయో క్లినిక్ ప్రకారం పాల అలర్జీ అనేది పాల ఉత్పత్తులు ఏది తిన్నా కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. అటువంటి వాళ్ళు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే చికిత్స. కానీ కొంతమంది పిల్లలు పాల అలర్జీని అధిగమిస్తారు. పాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అసలు పాలు తాగితే ఎందుకు అనారోగ్యానికి గురవుతారో తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేశారు.


సాధారణ ఆవు పాలలో లభించే A1 బీటా కేసిన్ అనే ప్రోటీన్ కారణంగా ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ ప్రోటీన్ జలుబు, రద్దీ, సైనస్, అలసట, వాపు, టైప్ 2 డయాబెటిస్, ఆటిజం, ఇతర నరాల సంబంధిత రుగ్మతలు వంటి వివిధ ఆరోగ్య సమస్యలతో ముడి పడి ఉంది. ఈ ప్రోటీన్ లేని పాలను A2 పాలు అంటారు. ఇవి ఆరోగ్యకరమైనవి. అయితే ఈ మ్యూటేషన్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందా లేదంటే కొద్ది మందినే ఇబ్బంది పెడుతుందా అనేది ఇప్పటికీ తేలలేదు. ఈ ప్తవరిం ప్రతి ఒక్కరినీ ఎలా ప్రభావితం చేస్తుంది ఇంకా స్పష్టంగా తెలియలేదు.


పాల వల్ల అనార్థాలు


ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం కూడా ఇదే విషయం చెప్తుంది. ఉదయం పాలు తీసుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. ఇది శరీరం ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. చర్మానికి ప్రయోజనకరంగా కూడా ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణవ్యవస్థపై ఇది అదనపు భారాన్ని ఇస్తుంది. కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి, వాంతులు వంటివి వస్తాయి.


పాలు తాగడానికి ఉత్తమ సమయం ఏది?


ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సాయంత్రం పాలు తాగడానికి ఉత్తమ సమయం. ఎందుకంటే పాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరాన్ని పునరుజ్జీవింప చేయడంలో సహాయపడుతుంది. ఉదయం పూట పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. సాయంత్రం తాగితే నరాలకు విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర హాయిగా పట్టేలా చేస్తుంది. కానీ నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందు తాగితేనె ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. పాలతో కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం కూడా శరీరానికి హాని చేస్తుంది. పాలు అరటి పండు అసలు మంచిది కాదు. అందుకే ఈ కాంబినేషన్ నివారించాలి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? లక్షణాలు ఏంటి