Watermelons: వేసవి కాలం వచ్చేసింది. మండే ఎండలకు ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండేందుకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఫ్రిజ్‌లో వస్తువులను నిల్వ ఉంచడం వల్ల వస్తువులు ఎక్కువ కాలం తాజాగా.. పాడవకుండా ఉంటాయని అనుకుంటారు. అయితే, రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ప్రతిదీ తాజాగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా సార్లు, ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువుల రుచి మారుతుంది. అంతేకాదు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందులో ఒకటి పుచ్చకాయ. పుచ్చకాయను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
మనం పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వెంటనే, దాని పోషక విలువలు కోల్పోతుంది. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లాబొరేటరీ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి, కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుంది. పరిశోధకులు 14 రోజుల పాటు పుచ్చకాయలను పరీక్షించారు. వారు ఈ పుచ్చకాయలను - 70, - 55, - 41 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఫ్రిజ్ లో స్టోర్ చేశారు. - 70 డిగ్రీ ఫారెన్‌హీట్ వద్ద నిల్వ చేసిన వాటిలో ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రత వద్ద అవి ఒక వారంలో కుళ్ళిపోవచ్చని పరిశోధకులు తెలిపారు.
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలామంచిది
శరీరంలో నీటి కొరత ఉండదు:
వేసవి కాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల నీటి లోపాన్ని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారు.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
మీరు బరువు తగ్గాలనుకుంటే పుచ్చకాయ ఉపయోగపడుతుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
పుచ్చకాయలో మంచి మొత్తంలో పీచు లభిస్తుంది. జీర్ణక్రియకు ఇది గొప్ప పండు. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
పుచ్చకాయ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రేగు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది:
పుచ్చకాయ అనేక రకాల వ్యాధుల నుండి ప్రేగులను కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృక్షజాలాన్ని పెంచుతుంది.
పుచ్చకాయతోపాటు ఈ పండ్లు కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు:
టమాటాలు
ఒకవేళ మీరు టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే వాటి యొక్క రిచ్, ఫ్లేవర్ పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచి ఉండదు. కాబట్టి ఈ సారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచండి.
అరటికాయలు
అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను తినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి.
ఆవకాడో
ఎంతో ఖరీదు పెట్టి ఆవకాడో కొన్నాం కదా అని ఫ్రిజ్‌లో పెట్టొద్దు. ఫ్రిజ్‌లో పెడితే ఆవకాడో టేస్టు మారుతోంది. తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది.
Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.