ఫ్యాషన్ ఐకాన్ రణవీర్ సింగ్. ఆయన న్యూడ్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ‌రణ్‌వీర్ నగ్న ఫోటోలు చేసి బాలీవుడ్ షేక్ అయింది. అభిమానులంతా షాకయ్యారు. అసలే ఆయన ఓవర్ డ్రెస్సర్. షర్టుపై షర్టు, ప్యాంటుపై ప్యాంటు వేసి ఫ్యాషన్ కు కొత్తర్థాన్ని చెప్పిన హీరో. హఠాత్తుగా బేర్ బాడీతో దర్శనమిచ్చేసరికి సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ ఫోటోల్లో కేవలం ఆయన బేర్ బాడీనే చూసిన వాళ్లు కొందరైతే, ఆయన పడుకున్న రగ్గును గమనించినవారూ ఉన్నారు. అందమైన రగ్గుపై అలా వాలి ఫోటోలు తీయించుకున్నాడు రణ్‌వీర్ సింగ్. 


Also read: రణవీర్‌కు చీర కట్టారు, దుప్పటి కప్పారు - ఈ మీమ్స్ చూస్తే నవ్వి నవ్వి అలసిపోతారు!


అది ఎలాంటి రగ్ తెలుసా?
రణ్‌వీర్ పడుకున్న ఆ రగ్గు జైపూర్ లో తయారైంది. ఆ రగ్గుల కంపెనీ పేరు కూడా ‘జైపూ్ రగ్స్’. వాళ్లు తమ ఇన్ స్టా ఖాతాలో ఆ కార్పెట్ తామే తయారుచేసినట్టు ప్రకటించుకున్నారు. ఈ కంపెనీ వారు చాలా ఖరీదైన కార్పెట్లను విక్రయిస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ విలాసవంతమైన కార్పెట్ ధర ఆరున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ కార్పెట్ ధరను మరింత పెంచేలా చేశాడు రణ్‌వీర్ సింగ్. ఈ కార్పెట్ చేతితో అల్లుతారు. తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. మెషీన్లను ఉపయోగించారు. 


Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్


ఎందుకు ఈ ఫోటోషూట్?
అంతర్జాతీయంగా పేరున్న కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఈ నగ్న ఫోటో షూట్ కు ఒప్పుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో. గతంలో జాన్ అబ్రహం కూడా ఇదే తరహాలో ఫోటోలకు ఫోజులిచ్చాడు. అప్పట్లో అది చాలా వివాదాస్పదం అయింది. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ఫోటోషూట్ చుట్టూ కూడా వివాదం నెలకొంటోంది.