మంచు లక్ష్మీ కన్నీంటిపర్యంతమయ్యారు. కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు’ అంటూ తన భాధను ఇన్ స్టా అభమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చిందో అని తెగ ఆలోచిస్తున్నారా? కరోనా వచ్చాక స్కూళ్లు మూత పడ్డాయి. చాలా స్కూళ్లను ఇప్పుడే ఓపెన్ చేశారు. మంచు లక్ష్మీ కూతురు కూడా రెండున్నరేళ్ల తరువాత ఈ రోజే స్కూలుకు వెళ్లింది. తనను స్కూలుకి పంపించాక చాలా కష్టంగా ఉందంటూ కామెంట్ చేసింది. ఈరోజు ఆమె ఇన్ స్టా స్టేటస్ నిండా మంచు లక్ష్మి కూతురు స్కూలుకి రెడీ అయిన ఫోటోలు, వీడియోలే ఉన్నాయి.
మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ యూనిఫారమ్ స్కూలు వాళ్లు ఇంకా ఇవ్వలేదని సాధారణ డ్రెస్సులోనే రెడీ అయ్యింది. మెరుపుల డ్రెస్సులు వేయొద్దని స్కూలు టీచర్ చెప్పారని అందుకే తనకు సాధారణ డ్రెస్సులు వేస్తున్నానని చెప్పుకొచ్చింది లక్ష్మీ మంచు. కూతురిని స్కూల్లో దించిన ఫోటోలను షేర్ చేసింది. తిరిగి ఇంటికి వచ్చాక ఏడుపు అందుకుంది. లాక్ డౌన్ పడ్డాక ఇంట్లో 24 గంటలు ఏం చేస్తారు పిల్లలు అనుకున్నానని, కానీ ఈ రెండేళ్లు తమ తల్లీకూతుళ్ల మధ్య బంధం చాలా పెరిగిందని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తరువాత తనను స్కూలుకి దింపి వస్తుంటే ఎంతో బాధ అనిపిస్తోందని, పాప మాత్రం చాలా ఆత్రుతగా స్కూలుకి వెళ్లేందుకు రెడీ అయ్యిందని చెప్పుకొచ్చింది. తనకు దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదని అంది. ఆమె మాట్లాడుతున్నంత సేపు కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది.