No Books in Private schools: ప్రైవేటు పాఠశాలలు కూడా తమ వద్దే పాఠ్య పుస్తకాలు కొనాలంటూ ప్రభుత్వం  నిబంధన తెచ్చింది కానీ పుస్తకాల సరఫరాపై మాత్రం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా పుస్తకాలు లేకుండానే పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి వస్తుంది. విద్యాశాఖనే పుస్తకాలు సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ.. వాళ్ల తల్లిదండ్రులేమో పిల్లలకు పుస్తకాలు కావాలంటూ బుక్ స్టోర్స్ చుట్టూ తిరుగుతున్నారు. గత మూడు వారాలుగా తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. పుస్తకాలు లేకుండానే పిల్లలను బడికి పంపిస్తున్నారు.


ఆన్ లైన్ లో ఇండెంట్ పెట్టినా సరఫరా లేదు..


పాఠశాలలు పునః ప్రారంభించి మూడు వారాలు కావొస్తున్న ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు అందలేదు. పాత పుస్తకాలతో తరగతిలో బోధన చేస్తున్నా... వాటిని పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవిగో పుస్తకాలు.. అవిగో పుస్తకాలు అంటూ అధికారులు చెప్పడమే తప్ప క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు అందుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల పుస్తకాలు ఇచ్చినా ఏ తరగతికీ పూర్తి స్థాయిలో లేదు. పాఠ్ పుస్తకాల కోసం ప్రైవేటు యాజమాన్యాలు ఆన్ లైన లో ఇండెంట్ పెట్టినా పూర్తిగా సరఫరా కావడం లేదు. 


ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి..


మండల, జిల్లా విద్యాధికారులను ఎవరన్ని కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని కడప జిల్లాకు చెందిన ఓ యాజమాన్యం వెల్లడించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొందరు ఆర్డర్లు పెట్టగా... ఈసారి విద్యార్థులు పెరిగారు. దీంతో ఇండెంట్ ను సవరించే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరినా దీనికి అవకాశం ఇవ్వడం లేదు. మరో పక్క కొన్ని బడులు మొదట్లో ఇండెంట్ పెట్టలేదు. ఇప్పుడు వారు వివరాలు నమోదు చేస్తున్నారు... వీరిపి ఎప్పుటికి పుస్తకాలు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలతో తమకు సంబంధం లేదని, బయట కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. బయట మార్కెట్ లో పుస్తకాలు తభించకోపవడంతో తల్లిదండ్రులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 


పాఠ్యాంశాల మార్పుతో పుస్తకాల ముద్రణ ఆల్యం..


రాష్ట్ర వ్యాప్తంగా 2021-2022 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి 72.47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 44.33 లక్షల, ఎయిడెడ్ 1.61 లక్షలు, ప్రైవేటులో 26.53 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారిలో దాదాపు 35 శాతం మందికే పుస్తకాలు అందాయి. ఈ ఏడాది ఎనిమిదో తరగతి సిలబస్ మార్పు చేయడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. ప్రభుత్వ బడులకే ఈ పుస్తకాలు పూర్తిగా అందలేదు. ప్రైవేటు వారికి ఎఫ్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి.