Mouth Health: నోరు మంచిదయితే.. ఊరు మంచిది అవుతుందని అంటారు. అలాగే నోరు మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంతకీ నోటికి, ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకేమిటని అనుకుంటున్నారా? ఇదిగో.. ఈ విషయాలు తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.


సాధారణంగా మనం వైద్యుల దగ్గరకు వెళ్తే నాలుక తెరవమని చెబుతారు. ఆ తర్వాత గొంతులోకి టార్చ్ లైట్ వేసి చూస్తారు. అలా ఎందుకు చూస్తారో చాలా మందికి తెలియదు. కానీ మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేసేది నోరు మాత్రమే. నాడి పట్టి రోగాన్ని ఎలా చెబుతారో.. నాలుకను చూసి అదే విధంగా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు వైద్యులు. ఇంతకీ అదెలా సాధ్యం? నోరు చూసి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చు?


దంతక్షయం:


జీవితంలో ఏదొక సమయంలో ప్రతి ఒక్కరూ దంత క్షయం సమస్యను ఎదుర్కొంటారు. మననోటిలో నివసించే బ్యాక్టిరియా యాసిడ్స్‌ను స్రవిస్తుంది. ఇది దంతాల ఎనామిల్ ఉపరితలానికి నష్టం కలిగిస్తుంది. దీంతో కావిటీస్ ఏర్పడతాయి. కావిటీస్‌కు చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే బ్యాక్టీరియా ఎనామెల్ కింద ఉన్న మృదువైన డెంటిన్‌పై దాడి చేస్తుంది. దీంతో దంతాల లోపలికి సోకుతుంది. దంతాల రంగు మారడంతోపాటు వేడికి, చలికి చాలా సెన్సిటీవ్ గా మారుతాయి. అంతేకాదు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా చిత్తవైకల్యం, కడుపుపూత, మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక వ్యాధులకు కారణం అవుతుంది. 


చిగుళ్ల వ్యాధి:


చిగుళ్ల వ్యాధి చిగుళ్ల వాపుతో ప్రారంభమవుతుంది. చిగుళ్లనుంచి రక్తస్రావం అవుతుంది. దంతాల బేస్ వద్ద బ్యాక్టీరియా చేరడం వల్ల మంట వస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, వ్యాధి పీరియాంటైటిస్‌గా మారుతుంది. ఇది చిగుళ్ల కణజాలం, దంతాలకు సపోర్టు ఇచ్చే ఎముకను నాశనం చేసే తీవ్రమైన గమ్ ఇన్‌ఫెక్షన్ గా మారుతుంది.


టెంపోరోమాండిబ్యులర్ రుగ్మత:


టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్ అనేది, దవడ కీలుతో ఏర్పడుతుంది. ఇది చాలా తీవ్రమైన నొప్పిని కలిగిఉంటుంది.దిగువ దవడ ఎముకను పుర్రెతో కలుపుతుంది. నమలడం, మింగడం, మాట్లాడటం, ఆవులించడం వంటి పనులు చాలా  కష్టంగా చేయాల్సి  వస్తుంది.  దవడ నొప్పి, నోరు తెరవడం లేదా మూయడానికి కష్టంగా ఉండటం, దవడ కదలిక సమయంలో శబ్దం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. 


చెడు శ్వాస:


1920 నాటి లిస్టరిన్ మార్కెటింగ్ ప్రచారం ద్వారా నోటి దుర్వాసన అనేది వెలుగులోకి వచ్చింది. ఇది నోరు కడగడాన్ని ప్రోత్సహించింది. దీన్ని హాలిటోసిస్ అంటారు. నోటి దుర్వాసన లేదా హాలోటిసిస్ అనేది టాన్సిల్స్, దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, సైనస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడుతుంది. అయితే ఇది మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి మరింత తీవ్రమైన పరిస్థితులను కూడా సూచిస్తుంది.


పొడిబారిన నోరు:


నోరు పొడిబారడం దీన్నే  జిరోస్టోమియా లాలాజల ప్రవాహాన్ని తగ్గించే ఔషధాల వల్ల, ముక్కు రద్దీ కారణంగా లాలాజల గ్రంథులకు నష్టం కలుగుతుంది. అప్పుడు  నోరు పొడిబారడం సరుగుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది, రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మాట్లాడటం, మింగడం కష్టతరం చేస్తుంది. అలాగే దంత క్షయం, ఫంగల్ ఇన్ఫెక్షన్‌ పెంచుతుంది.


నోటి క్యాన్సర్:


ఓరల్ క్యాన్సర్ పురుషులలో ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్, ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200,000 మందిని ప్రభావితం చేస్తుంది, ఇది పొగాకు, ఆల్కహాల్ వినియోగంతో పాటు  హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)తో ముడిపడి ఉంటుంది. దంతాల్లో రక్తస్రావం, మింగడంలో ఇబ్బంది, బరువు తగ్గడం వంటివి నోటి క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు.


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.