నీళ్లు ప్రాణాధారం. శరీర అవసరాలకు తగినంత నీళ్లు చేరితేనే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కానీ కొంతమంది అతిగా నీళ్ల తాగుతారు. ఇలా చేయడం వల్ల  చర్మం మెరుపు సంతరించుకుంటుందని కొందరి అభిప్రాయం. అలాగే బరువు తగ్గుతామని కూడా భావిస్తుంటారు. అది నిజమేనా? అవసరానికి మించి అతిగా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అనర్థాలు కలగవా? అంటే కచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు నిపుణులు. 


సాధారణంగా మనిషి రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. రోజుకు ఆరు గ్లాసుల కన్నా తక్కువ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అదే పదిగ్లాసుల కన్నా ఎక్కువ నీరు తాగితే అందం మాట దేవుడెరుగు శరీర కణాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అవసరానికి మించి నీళ్లు తాగడం వల్ల... ఆ నీటినంతా వడపోసి బయటికి పంపించాల్సిన భారం కిడ్నీలపై పడుతుంది. దీనివల్ల కణాల్లో వాపు ఏర్పడే అవకాశం ఉంది. 


నీరు తక్కువ తాగితే ఎంత ప్రమాదమో, ఎక్కువ తాగినా అంతే ప్రమాదం. తలనొప్పి మొదలవుతుంది. ఒకంతట తగ్గదు. పైగా వాంతి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ పరిస్థితి చాలా అసౌకర్యంగా ఉంటుంది.  రక్తం లవణాలను గ్రహించే శక్తి కోల్పోయి శరీరభాగాల పనితీరులో తేడాలు వస్తాయి. గుండె కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తద్వారా రక్తపోటు కూడా పడిపోతుంది. 


అతిగా నీళ్లు తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల మూత్రంలో పొటాషియం శరీరం నుంచి బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కాళ్ల నొప్పులు, ఛాతీనొప్పి మొదలువుతుంది. కనుక అవసరమైనంత నీరే తాగడం అలవాటు చేసుకోవాలి. మూత్రం రంగులో తేడాను కూడా గమనించాలి. 


చలికాలంలో కాస్త తక్కువ నీరు తాగినా ఫర్వలేదు. అలాగే వేసవిలో మాత్రం ఎక్కువ నీరు తాగాల్సి వస్తుంది. శరీర అవసరాలను గుర్తించి తగినంత నీరు తాగితే ఎలాంటి సమస్య ఉండదు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు


Also read: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా


Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు


Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు












ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.