బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడొస్తుందో చెప్పలేం, అనారోగ్య జీవనశైలి కారణంగా ఈ సమస్య ఎక్కువమందిలో వస్తోంది. మెదడకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీని వల్ల మెదడులోని కణాలు మరణిస్తాయి. సమయానికి చికిత్స అందక పోతే ఆ వ్యక్తి మరణించే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మినీ స్ట్రోక్ వస్తుంది. దీని లక్షణాలు కొన్ని సెకన్ల పాటూ మాత్రమే ఉండి వెళ్లిపోతాయి. ఈ పరిస్థితిని ‘తాత్కలిక ఇస్కిమిక్ ఎటాక్’ అని పిలుస్తారు. ఈ  లక్షణాలు కొన్ని సెకన్ల పాటే వస్తాయి కనుక ఎవరూ వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా వదిలేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్య రావచ్చు. కాబట్టి వీటికి చికిత్స తీసుకోవడం అవసరం. 


మినీ-స్ట్రోక్ లక్షణాలు 
కొన్ని సెకన్ల పాటూ వచ్చి వెళ్లే మినీ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. ముఖం ఒక వైపు లాగినట్టు అవుతుంది. 
2. నవ్వలేరు
3. రెండు చేతులు ఎత్తలేరు
4. సరిగా మాట్లాడలేరు
5. తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. 
6. సరిగా మాట్లాడలేరు
7.కళ్లు కాసేపు మసకబారుతాయి
8. శరీరభాగాల మధ్య సమన్వయం ఉండదు


కారణాలు ఏమిటి?
మినీ స్ట్రోక్ వచ్చినప్పుడు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవి కొన్ని సెకన్లలో మాయమవుతాయి. మీకు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. మెదడుకు వెళ్లే రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళాల్లో ఏదైనా అడ్డుపడడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ధూమపానం అధికంగా చేసే వారిలో, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో,ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. 


రాకుండా ఏం చేయాలి?
మినీస్ట్రోక్ వంటివి రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డైటరీ ఫైబర్ అంటే కరిగే ఫైబర్ ఉండే ఆహారం శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే పండ్లు, ఓట్స్, తృణధాన్యాలు అధికంగా తినాలి. తగిన నిద్ర, విశ్రాంతి మెదడుకు ఇవ్వాలి. 


Also read: ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.