Skin Care Routine : ఇంట్లో ఉపయోగించే పదార్థాలతో చేసే హోం రెమిడీలు కానీ.. ఫేస్ ప్యాక్​లను కానీ నిపుణులు అంత త్వరగా ఆమోదించరు. కానీ.. ఓ DIY ఫేస్ ప్యాక్​ను మాత్రం డెర్మటాలజిస్ట్​లు ఆమోదిస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన ఓ DIY ఫేస్​ ప్యాక్​ను చర్మవైద్య నిపుణులు ఆమోదం ఇచ్చారు. ఇంతకీ జాన్వీ కపూర్ ఉపయోగించిన ఫేస్ ప్యాక్ ఏంటి? ఏయే పదార్థాలతో ఈ రెమిడీ చేసింది.. దీనితో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. డెర్మటాలజిస్ట్​ దీనిని ఎందుకు ఆమోదించారో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవాడనికి పెరుగు, తేనె, అరటిపండు ఉంటే చాలు. దీనిని మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఓ గిన్నెలో పెరుగు, తేనె, అరటిపండు గుజ్జు మిశ్రమాన్ని కలిపి ఫేస్​కు అప్లై చేయాలి. అంతే సింపుల్​గా ఈ ఫేస్​ ప్యాక్​ను రెడీ చేసుకోవచ్చు. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. ఈ పదార్థాలన్నీ చర్మాన్ని తేమగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా చర్మానికి పోషణనిచ్చి.. హెల్తీగా ఉంచుతాయి అంటున్నారు. 


మీకు పొడి చర్మం ఇబ్బంది పెడుతున్నా.. లేదా ఇతర కారణాల వల్ల చర్మం పొడిగా మారుతున్నా.. మీరు ఈ మాస్క్​ని ట్రై చేయవచ్చు. ఇది మీ చర్మానికి మాయిశ్చరైజర్​ని అందిస్తుంది. మీరు పెరుగు మీగడను కూడా ఈ ప్యాక్​లో ట్రై చేయవచ్చు. ఇది మీకు మరింత తేమను అందిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మాన్ని పొడిబారడం నుంచి కాపాడుతుంది. 


మాయిశ్చరైజేషన్ కోసం..


తేనె, పెరుగులోని సహజ హ్యూమెక్టెంట్లు ఉంటాయి. ఇవి చర్మంలో తేమను ఆకర్షిస్తాయి. అంతేకాకుండా తేమను చర్మంలో ఇమిడేలా చేస్తాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయం చేస్తాయి. మీకు రఫ్ చర్మం ఉంటే.. ఈ ప్యాక్ మీకు మిరాకిల్స్ చేస్తుంది. 


పోషణ కోసం..


అరటిపండ్లలో విటమిన్లు, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. ఇవి చర్మాన్ని హెల్తీగా ఉంచడంతో పాటు.. నిర్జీవంగా ఉన్న చర్మానికి పోషణను అందిస్తుంది. 


ఎక్స్​ఫోలియేషన్ కోసం..


హెల్తీ స్కిన్​ కావాలంటే ఎక్స్​ఫోలియేట్ చేయాల్సిందే. అప్పుడు మీ స్కిన్ మంచి ప్రయోజనాలు పొందుతుంది. అయితే ఈ ఫేస్​ ప్యాక్​ కూడా మంచి ఎక్స్​ఫోలియేటర్​గా పనిచేస్తుంది. అరటిపండ్లలోని ఎంజైమ్​లు చర్మాన్ని సున్నితంగా ఎక్స్​ఫోలియేట్ చేస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగించడంలో, స్కిన్​ హెల్త్​ను ప్రోత్సాహిస్తాయి. ఫలితంగా చర్మాన్ని నునుపైన, కాంతివంతంగా ఉంటుంది.


సహజమైన మెరుపు..


తేనె, అరటిపండు, పెరుగు చర్మ కాంతిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి నల్లమచ్చలు, స్పాట్స్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. 


యాంటీ ఏజింగ్ కోసం..


వయసు మీద పడేవారికి ఫైన్​ లైన్స్​తో ఇబ్బంది పడుతుంటారు. రింకిల్స్​ ఇబ్బంది పెడతాయి. వయసు మీద పడుతున్న వారికి కూడా ఈ ఫేస్​ప్యాక్ బెనిఫిట్స్​ ఇస్తుంది. అరటిపండులోని తేనె, విటమిన్ సిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి. ఫైన్ లైన్స్, ముడతలు, నీరసం వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. 


మొటిమలకు..


తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా తేనె, పెరుగు మంటను తగ్గించి.. చర్మం ఎర్రగా మారడాన్ని తగ్గిస్తుంది. 


Also Read : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే