Tips to Reduce Stomach Upset : ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం, అతిగా తినడం, ఒత్తిడి వంటి కారణాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల చాలామందికి అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. అలాంటి ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ ఆహారపు అలవాట్లు, ఇంటి చిట్కాలు తోడ్పడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
ఇంగువను ట్రై చేయండి..
ఇంగువను భారతీయ వంటకాల్లో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. కొద్దిగా ఇంగువను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాలు తగ్గవచ్చు. అయితే ఇది అందరికీ ఒకేలా పనిచేస్తుందని చెప్పలేము.
Also Read : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
పుదీనా టీతో
పుదీనాలో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ కండరాలను సడలించడంలో సహాయపడవచ్చు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల కొందరికి కడుపు అసౌకర్యం తగ్గవచ్చు. అయితే అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు తాగకపోవడమే మంచిది.
హైడ్రేషన్ చాలా ముఖ్యం
శరీరానికి సరిపడా నీరు అందితే జీర్ణక్రియ సక్రమంగా సాగడానికి, మలబద్ధకం సమస్య తగ్గడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారు తగినంత నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువగా తాగకుండా రోజంతా కొద్దికొద్దిగా తాగడం మంచిది.
Also Read : ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి, అందానికి కలిగే లాభాలు ఏంటి? రోజుకు ఎన్ని తినాలి?
పెరుగు తీసుకోండి
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. కొందరిలో జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. మజ్జిగను కూడా చాలా రెగ్యూలర్గా తీసుకోవచ్చు. అయితే పాలు, పాల ఉత్పత్తులు పడనివారికి పెరుగు కూడా అసౌకర్యం కలిగించవచ్చు.
ఎక్కువ తినకండి
ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా కడుపు నిండిన భావన, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఆకలికి తగినంత మాత్రమే తినాలి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం కూడా మంచిది.
Also Read : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే కలిగే లాభాలు.. బాడీ డీటాక్స్ నుంచి బరువు తగ్గడం వరకు
డీప్ ఫ్రైడ్ ఫుడ్
అధిక కొవ్వు, నూనెతో తయారుచేసిన పదార్థాలు కొందరిలో జీర్ణక్రియను నెమ్మదింపజేసి కడుపు అసౌకర్యాన్ని పెంచుతాయి. తరచూ ఫాస్ట్ ఫుడ్, వేయించిన పదార్థాలు తినడం తగ్గించి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
స్ట్రెస్ తగ్గించుకోండి
ఒత్తిడి, ఆందోళన కూడా జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, నడక లేదా యోగా వంటి శారీరక కార్యకలాపాలు చేయడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
పదే పదే వస్తుంటే..
తరచూ కడుపు నొప్పి, అజీర్ణం, ఉబ్బరం లేదా అసిడిటీ వస్తుంటే కేవలం ఇంటి చిట్కాలపై ఆధారపడకండి. సమస్యకు అసలు కారణం తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన నొప్పి, వాంతులు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
Also Read : మార్నింగ్ రొటీన్ సెట్ చేసుకోవడానికి, ఉదయాన్నే హెల్తీగా ప్రారంభించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
