మధుమేహులు తినే ఆహారం విషయంలో మాత్రమే కాదు పండ్లు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. ఇవే కాదు అధిక ఉష్ణోగ్రతలు రక్తంలో షుగర్ లెవల్స్ పెంచేస్తాయి. అందుకే వేసవిలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెర పెరగకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వేసవిలో ఈ లభించే ఈ పండ్లు తింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
పుచ్చకాయ: నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. దీని తినడం వల్ల మధుమేహ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. పుచ్చకాయలో మితంగా లైకోపీన్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. ఇది పండ్లకు మంచి రంగుని ఇస్తుంది. లైకోపీన్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహులు హృదయ సంబంధ వ్యాధులని ఎదుర్కొనే అవకాశం రెండు రెట్లు ఎక్కువ.
మామిడి పండు: వేసవిలో లభించే మరో సీజనల్ ఫ్రూట్ మామిడి. జ్యూసీ, రుచి కలిగిన మామిడిలో చాలా కేలరీలు చక్కెర నుంచి వస్తాయి. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కానీ తక్కువ మొత్తంలో మామిడి తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) కలిగి ఉంటుంది. మామిడిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
పైనాపిల్: డయాబెటిక్ రోగులు పైనాపిల్ తినొచ్చు కానీ మితంగా తీసుకుంటేనే మంచిది. చక్కెర లేకుండా ఉండే తాజా పైనాపిల్ లేదా క్యాన్డ్ పైనాపిల్ ఎంచుకోవాలి. ఈ పండు తినే ముందు దానిపై చక్కెర సిరప్ అసలు వేసుకోకూడదు. అలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
ఆరెంజ్: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు నారింజ తీసుకోవచ్చు. అయితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచుకునేందుకు జ్యూస్ ఎక్కువగా ఉండే నారింజ ఉత్పత్తులు తీసుకోవడం పరిమితం చేయాలి. నారింజ రసం అధిక GIని కలిగి ఉంటుంది. ఇది కార్బ్ రిచ్ ఫుడ్. రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు నారింజ రసం తీసుకోకూడదు.
పియర్: డయాబెటిస్ తినదగిన అద్భుతమైన పండు. ఇందులోని పోషకాలు మధుమేహ రోగులకు గొప్ప ప్రయోజనాలు చేకూరుస్తాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. బెరీ కూడా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది, అందువల్ల అవి రక్తంలో గ్లూకోజ్ ని త్వరగా పెంచవు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేగంగా బరువు తగ్గేందుకు ఈ పద్ధతి ఫాలో అవుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా?