చాలా మంది అల్పాహారంలో ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. పరోటా, ఆమ్లెట్, తృణధాన్యాలతో పాటు ఇది కూడా తప్పనిసరిగా తీసుకుంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన శక్తివంతమైన ఎనర్జీ డ్రింక్ ఇది. మొత్తం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. కానీ అది పరిమితిగా తీసుకున్నప్పుడు మాత్రమే. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే దీన్ని అధిక పరిమాణంలో వినియోగించినప్పుడు కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అవేంటంటే..


బరువు


ఇందులో కేలరీలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో చక్కెర పెరుగుదలకి కారణమవుతుంది. అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పడిపోయే విధంగా చేస్తుంది. బరువు పెరగడానికి దారి తీస్తుంది.


మధుమేహం


కొన్ని అధ్యయనాల ప్రకారం ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తపోటు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతరులతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారు ఈ దుష్ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.


చర్మ అలర్జీ


కొన్ని నివేదికల ప్రకారం నారింజ రసం చర్మ అలర్జీకు దారి తీస్తుంది. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చక్కెర, కేలరీలు ఎక్కువగా శరీరానికి అందుతాయి. అది చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.


నిద్రలేమి


నారింజ రసం అధిక మొత్తంలో తీసుకుంటే నిద్రలేమికి దారి తీయవచ్చు. షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా హెచ్చుతగ్గులకి కారణం అవుతుంది. దీని ప్రభావం నిద్ర మీద పడుతుంది.


అసిడిటీ


నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది అధికంగా తీసుకుంటే చర్మ చికాకు కలిగిస్తుంది. ఆమ్ల స్వభావం కలిగి ఉన్న ఆరెంజ్ పొట్ట సంబంధిత సమస్యలు, అసిడిటీకి కారణమవుతుంది.


ఎంత మోతాదులో తీసుకోవాలి?


ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి, బి ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల మూలం. ఇందులోని విటమిన్ సి చర్మ సంరక్షణకి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. చర్మం ముడతలు పడకుండా నిరోధిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. చర్మం, ఊపిరితిత్తులు, మొత్తం జీవక్రియని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ప్రతిరోజూ 240 ఎంఎల్ వరకు నారింజ రసం తీసుకోవడం ఉత్తమం. అప్పుడే కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. ఆరోగ్య ప్రయోజనాలు సరిగా అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేసి మిమ్మల్ని అందంగా మారుస్తుంది. నారింజ తొక్కలతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మీద ఉన్న నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: నిద్రలేమిని నయం చేసే వృక్షాసనం - ఈ సమస్యలున్న వాళ్ళు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది