రిగ్గా వర్షాకాలం రాగానే ఆ ఊరి ప్రజలంతా ఒక్కటవ్వుతారు. ఆ రోజు తవ్వాల్సిన సమాధుల జాబితాను తయారు చేస్తారు. ఆ తర్వాత ఒక్కో సమాధిని తవ్వుతారు. శవాల నోటిలోకి పంపు పెట్టి నీళ్లు పోస్తారు. ఎందుకలా? అనేగా మీ ప్రశ్న. అయితే, మీరు ఈ గ్రామం గురించి తెలుసుకోవల్సిందే. 


మన దేశంలో ఎన్నో సాంప్రదాయలు, ఆచారాలు అమల్లో ఉన్నాయి. దేవుడిని నమ్మినట్లే దెయ్యాలను, ఆత్మలను కూడా నమ్ముతారు. భిన్నమైన ఈ రెండు శక్తులకు భయపడతారు. భూమిపై ఉన్న పంచభూతాలను సైతం దైవంగా కొలిచే నేల మనది. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు చేస్తాం. కప్పలకు పెళ్లిల్లు చేస్తాం.. ఇంకా అలాంటి ఆచారాలు చాలానే ఉన్నాయి. అయితే, కర్ణాటకలోని బీజాపూర్‌లోని కలకేరి గ్రామస్తులు మాత్రం వర్షాల కోసం సమాధులు తవ్వుతారు. మృతదేహాలకు నీళ్లు పట్టిస్తారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. 


గత కొద్ది రోజులుగా దేశమంతా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, కలకేరి గ్రామం మాత్రం వర్షాలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి జూన్ నెలలోనే కర్ణాకటలో వర్షాలు మొదలవుతాయి. కానీ, ఆ గ్రామంలో మాత్రం చుక్క చినుకు కూడా పడలేదు. దీంతో గ్రామస్తులంతా కూర్చొని.. మృతదేహాల దాహాన్ని తీర్చాలని డిసైడ్ అయ్యారు. దీంతో గత నెలలో చనిపోయిన వ్యక్తుల పేర్లతో ఒక జాబితాను తయారు చేశారు. సంబంధిత కుటుంబికులను పిలిచి.. చనిపోయిన మీ ఆప్తుల దప్పికను తీర్చేందుకు సహకరించాలని కోరారు. 


కుటుంబికులను సమాధుల వద్దకు తీసుకెళ్లి.. తల ఏ దిక్కున పెట్టారో తెలుసుకున్నారు. అక్కడ రెండు అడుగుల గుంత తవ్వి మృతదేహం నోటి వరకు పైపును పంపారు. అనంతరం ట్యాంకర్ నుంచి నీటిని మృతదేహం నోట్లోకి వదిలారు. ఇలా సుమారు 25 సమాధుల్లోని మృతదేహాలకు నీళ్లు తాగించారు. చిత్రం ఏమిటంటే.. వారు ఇలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో చినుకులు పడటం మొదలైంది. దీంతో వారి నమ్మకం మరింత బలపడింది.


ఆ శాపం ఫలితమే.. నేడు ఈ ఆచారం: ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వర్షాలు కురవకపోతే ఏడాది మొత్తం అంతా పస్తులుండాల్సిందే. తమ ఊరిలో వర్షాలు కురవకపోవడానికి గల కారణం.. చాలా ఏళ్ల కిందటి శాపమే కారణమని స్థానికులు చెబుతుంటారు. కలకేరిలో ఒక వృద్ధుడు తన నోరు పెద్దగా తెరిచి చనిపోయాడు. నోరు మూయకుండానే అతడిని ఖననం చేశారు.


ఆ ఏడాది తర్వాత గ్రామంలో తీవ్ర కరువు, దుర్భిక్షం వచ్చిందట. దీంతో గ్రామస్తులు జ్యోతిష్కుడిని పిలిపించి కరువుకు కారణం తెలుసుకోవాలని కోరారు.  పిలిచారు, దాహంతో ఉన్న శవం గ్రామాన్ని శపించిందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అతడి సూచన మేరకు సమాధని తవ్వి ఆ వృద్ధుడి సమాధి తవ్వి మృతదేహానికి నీరు పట్టించారు. అలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో వర్షం పడిందట. అన్నట్లు.. హిందు సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వ్యక్తుల నోటితో తులసి తీర్థం పోసి, నీరు మూసి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే, ఇందుకు కూడా ఏదైనా బలమైన కారణమే ఉండి ఉండొచ్చు. 


Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్


Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!