Beat the Heat with These Delicious Foods : సమ్మర్​ హీట్​ని తగ్గించుకోవడానికి మీ డైట్​లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్ ఇవేసూర్యుడు విజృంభించేస్తున్నాడు. పగలు బయటకు వెళ్లాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నా.. ఆఫీస్​లో ఉన్నా ఎండ వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. పైగా ఈ వేడి వల్ల శరీరంలో హీట్ పెరిగిపోతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మీరు కూడా ఇలా బాడీ హీట్​తో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు డైట్​లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అవి మీకు మంచి రుచిని అందించడమే కాకుండా శరీరంలోని హీట్​ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పైగా ఆరోగ్యానికి కూడా ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయి. 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో సహజమైన కూలింగ్ లక్షణాలు ఉంటాయి. సమ్మర్​లో దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే బాడీ హీట్​ తగ్గుతుంది. అంతేకాకుండా హైడ్రేషన్​ని అందించడంలో హెల్ప్ చేస్తుంది. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్​ను ఇది తిరిగి శరీరానికి అందిస్తుంది. స్కిన్​, హెయిర్​ హెల్త్​ని కూడా మెరుగుపరుస్తుంది. 

కొబ్బరి గుజ్జు

ఫ్రెష్​గా కొట్టిన కొబ్బరిలోని గుజ్జు కూడా మంచి రుచిని అందించడంతో పాటు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మీరు కొబ్బరి నీళ్లకోసం వెళ్లినప్పుడు దీనిని తప్పకుండా తినండి. ఇది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. 

కీరదోస

కీరదోస పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్​ని అందిస్తుంది. కూలింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. జీర్ణ సమస్యలు.. ముఖ్యంగా మలబద్ధకాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు దీనిని సలాడ్స్​లో, స్మూతీలలో, ఇన్​ఫ్యూజ్ చేసిన వాటర్​లో లేదా భోజనం చేసిన తర్వాత నేరుగా కూడా తీసుకోవచ్చు. 

బేసిల్ సీడ్స్

బాడీ హీట్​ని తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సమ్మర్​లోని జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీరు వీటిని నానబెట్టుకుని.. నీటిలో కలిపి లేదా సలాడ్స్​లో తీసుకోవచ్చు. లేదంటే ఓట్స్ బౌల్​లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్​ మిల్క్​లో, షర్బత్​లలో కూడా బేసిల్ సీడ్స్ తీసుకోవచ్చు. 

కలబంద

శరీరంలోని ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తాగడం కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ.. దాని బెనిఫిట్స్ మాత్రం ఈ కష్టాన్ని మరచిపోయేలా చేస్తాయి. స్కిన్​కి, జుట్టుకు, ఆరోగ్యానికి కలబందతో ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. కాబట్టి మీరు దీనిని కష్టమైనా డైట్​లో తీసుకుంటే మంచిది. 

పుదీనా

పుదీనాలో శరీరాన్ని కూల్ చేసే లక్షణాలు ఉంటాయి. దీనిని మీరు జ్యూస్​లలో, రిఫ్రెష్​ డ్రింక్​లలో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే చేసుకునే స్మూతీలలో కూడా పుదీనా వేసుకుని కూలింగ్ లక్షణాలు పెంచుకోవచ్చు. 

పుచ్చకాయ

సమ్మర్​లో ఎక్కువమంది తీసుకునే ఫుడ్​లలో పుచ్చకాయ ఒకటి. ఇది శరీరానికి హైడ్రేషన్ అందించి.. వేడిని తగ్గిస్తుంది. టేస్టీగా ఉండే ఈ పుచ్చకాయను నేరుగా తినొచ్చు. సలాడ్స్​, జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. రుచిని అందిస్తూనే ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఇస్తుంది.  

మజ్జిగ

బటర్ మిల్క్​ లేకుండా సమ్మర్​ వెళ్లడం కష్టమే. పైగా ఇది గట్ హెల్త్​కి చాలా మంచిది. అలాగే ఒంట్లోని వేడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమ్మర్​లో రోజూ దీనిని తీసుకుంటే చాలా మంచిది. పైగా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 

యోగర్ట్ 

శరీరంలోని వేడిని తగ్గించి జీర్ణ సమస్యలు దూరంం చేస్తుంది. దీనిని మీరు నేరుగా తినొచ్చు. యాడెడ్ ఫ్లేవర్స్ లేని యోగర్ట్ వాడడమే మంచిది. హీట్​ని తగ్గించి.. హెల్తీగా ఉండేందుకు మీరు దీనిని డైట్​లో చేర్చుకోవచ్చు. ఫ్రూట్స్​తో లేదా సలాడ్స్​లో దీనిని తీసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.