Connection Between BP Medicines and Heart Attacks : సాధారణంగా రక్తపోటు(BP)ను కంట్రోల్ చేసేందుకు ఇచ్చే మందులు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బీపీని కంట్రోల్ చేయడం అంటే గుండెపై ప్రెజర్​ని తగ్గించడమే. ఈ విషయం తెలియక బాగానే ఉన్నాం కదా అని చాలామంది బీపీ మందులను వేసుకోవడం మానేస్తారు. దీనివల్ల గుండెపై ప్రెజర్ పడి హార్ట్ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనిపై చేసిన అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. 

సడెన్​గా బీపీ మందులు వేసుకోవడం మానేస్తే రక్తపోటు అధికమవ్వడంతో పాటు.. గుండె సంబంధిత లక్షణాలు ఎక్కువ అవుతాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు బీపీ కూడా ఉండి.. మందులు వాడడం ఆపేస్తే.. పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నాయి అధ్యయనాలు. 

సడెన్​గా బీపీ మందులు మానేస్తే..

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. దానిలో సడెన్​గా బీపీ మెడిసన్స్ ఉపయోగించడం మానేసిన వారిలో మానసికంగా ఇబ్బందులు పడడంతో పాటు.. గుండె సంబంధిత సమస్యలను అనుభవించినట్లు గుర్తించారు. హార్ట్​బీట్ రేట్ మారడం, వణుకు రావడం వంటి లక్షణాలు కలిగినట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. 

గుండెపై ఎఫెక్ట్ చూపిస్తాయా?

బీపీని కంట్రోల్ చేయడానికి అవసరమైన మందులను ఆపేస్తే.. అది అంతర్లీనంగా కూడా పలు ఇబ్బందులను కలిగిస్తుందని.. జాయింట్ నేషనల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇలా మానేయడం వల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు వేగంగా పెరుగుతాయని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్​లో 975 మంది పాల్గొనగా.. 886 మంది బీపీ మెడిసన్స్ మానేశారు. వీరిలో ఎక్కువశాతం మందికి స్ట్రోక్, టెంపరరీ ఇస్కీమిక్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, గుండెకు రక్తప్రసరణ వైఫల్యం అవ్వడం గుర్తించారు.

ఏ పరిస్థితుల్లో మానేయవచ్చంటే..

బీపీని కంట్రోల్ చేయడానికి మందులు మానేయాలకుంటే కొన్ని రెగ్యులర్​గా చేయవచ్చని ఈ నివేదికలో తెలిపారు. <145/85 mmHg బీపీ ఉన్నవారు మందులు మానేసి.. బీపీని కంట్రోల్ చేయడానికి బరువు తగ్గడం, ఉప్పును కంట్రోల్ చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వ్యాయామం చేయడం, మాదక ద్రవ్యాలు వాడకం మానేయడం వంటివి కూడా బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయని తెలిపారు. అయితే హృదయ సంబంధ వ్యాధులు లేనివారే సహజంగా బీపీని తగ్గించుకునేందుకు ఇవి ట్రైచేయాలి. ఇప్పటికే గుండె సమస్యలు ఉంటే.. బీపీ మందులు మానేయడం అస్సలు మంచిది కాదని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కాబట్టి మీరు కానీ.. మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా బీపీ మందులు మానేసినా.. లేదా మానేయాలని ఆలోచిస్తున్నా.. కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోండి. అలాగే ఒకవేళ మానేయాలనుకుంటే.. మీరు వైద్యులు సూచించే నియమాలు కచ్చితంగా పాటించాలి. జీవనశైలిలో మార్పులు చేయాలి. ఇవేమి పాటించకుండా.. బీపీ మందులు మానేస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.