Weight Loss with Coffee Diet : కాఫీ డేట్​ గురించి చాలామందికి తెలుసుగానీ.. కాఫీ డైట్​ గురించి ఎక్కువమందికి తెలియదు. అయితే బరువు తగ్గడానికి ఈ మధ్యన కొందరు ఈ డైట్​ను ఫాలో అవుతున్నారు. అసలు ఈ కాఫీ డైట్ ఏంటి? దీనివల్ల నిజంగానే బరువు తగ్గుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? తాత్కాలికమైన ఫలితాలు మాత్రమే ఇస్తుందా? లేదా ఎక్కువ కాలం మంచి ఫలితాలు ఇస్తుందా? దీనిపై నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం. 


కాఫీ డైట్​ గురించి 2017లో ఓ బుక్​లో రాశారు. కాఫీ లవర్స్​ డైట్​ నుంచి ఇది వచ్చినట్లు దానిలో తెలిపారు. కాఫీని బరువు తగ్గేందుకు వినియోగించుకోవచ్చని. అయితే రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగాలని రాసుకొచ్చారు. దీనివల్ల బరువు తగ్గుతారని.. జీవక్రియ పెరిగి.. ఆకలి తగ్గుతుందని తెలిపారు. క్యాలరీలు శోషణను కూడా అడ్డుకుని.. కొవ్వును కాల్చేస్తుందని తెలిపారు. అయితే ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు రోజుకు 1500 కేలరీలు మాత్రమే తినాలని వెల్లడించాడు. ఈ డైట్​లో మూడు పూట్లలో ఏదొక సమయంలో భోజనానికి బదులుగా అధిక ఫైబర్ కలిగిన స్మూతీని తీసుకోవచ్చని.. ఇది కూడా ఆకలిని కంట్రో చేస్తుందని రాసుకొచ్చారు. 


ఈ డైట్ ఫాలో అవ్వడం మంచిదేనా?


కాఫీ డైట్​ ఫాలో అవ్వాలంటే బయట దొరికే కాఫీ పౌడర్లతో కాకుండా ఇంట్లోనే కాఫీ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇంట్లోనే లేతగా కాల్చిన బీన్స్​తో అప్పటికప్పుడు ఫ్రెష్​గా పిండి చేసి.. దానితో కాఫీ చేసుకుని తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్రెష్​గా గ్రైండ్ చేస్తే.. లైట్ రోస్ట్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు.. బరువు వేగంగా తగ్గుతారంటున్నారు. అయితే కాఫీలలో షుగర్ వేసుకోకుండా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయట. ప్రాసెస్ చేసిన కాఫీ అంత మంచిది కాదని చెప్తున్నారు. కాఫీ నుంచి యాంటీ ఆక్సిడెంట్లు పొందడంతో పాటు.. పుష్కలంగా ఫైబర్, క్లీన్ గట్ ఉంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్తున్నారు. 


దీనిని ఫాలో అవ్వడం మంచిదేనా?


కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. ఈ డైట్​ ఫాలో అయితే నిజంగానే బరువు తగ్గుతారు అనేందుకు ఎలా ఆధారాలు లేవు. కానీ కాఫీ ఆకలిని తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల భోజనం చేసే ముందు కాఫీ తీసుకుంటే తక్కువ ఫుడ్ తీసుకుంటారు. భోజనానికి మూడు లేదా నాలుగు గంటల ముందు కాఫీ తాగితే ఆకలి తగ్గదు. జీవక్రియపై కాఫీ అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. 


వారికి మాత్రమే మంచిది.. కానీ


జిమ్​లో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. కాఫీ తీసుకునేవారిలో మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కానీ కేవలం కాఫీ డైట్​ ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గడమనేది కష్టమని చెప్తున్నారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఎక్కువ కాఫీతే కొవ్వు కరగకపోగ.. ఆరోగ్యం విషమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓ కప్పు తాగాలంటే మీరు దానికోసం ఎంత కాఫీని ఉపయోగిస్తున్నారనేది కూడా ముఖ్యమైన అంశమేనని చెప్తున్నారు. పరిమితిని దాటకుండా కెఫీన్ తీసుకోవచ్చని.. మోతాదుకు మించితే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని చెప్తున్నారు. 


మళ్లీ బరువు పెరుగుతారా?


ఈ కాఫీ డైట్​ని ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కువకాలం కాఫీని రెగ్యూలర్​గా తీసుకుంటే.. నిద్రలేమి, డిప్రెషన్​ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కాఫీ తాగితే.. అది మీ నిద్రమీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి డైట్ ప్రయత్నించేప్పుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. 


Also Read : సైలెంట్ కిల్లర్స్​తో జాగ్రత్త, ప్రాణాలు హరిస్తున్న బీపీ సమస్యలు.. న్యూ స్టడీలో షాకింగ్ రిజల్ట్స్






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.