Home Cleaning Tips for Diwali :  భారతదేశంలో దీపావళి (Diwali 2025) చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి ఈ పండుగ 2025లో అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈ సమయంలో పండుగ చేసుకునేవారు ఇంటిని కచ్చితంగా శుభ్రం చేసుకుంటారు. బూజులు దులపడం, బట్టలు ఉతకడం వంటి క్లీనింగ్స్ ప్రారంభమైపోయే ఉంటాయి. ఇంటిని అలంకరించడానికి, దీపాలు వెలిగించడానికి అనువుగా ఇంటిని క్లీన్ చేస్తారు. అయితే పండుగల సమయంలో ఇంటిని క్లీన్ చేయడం వెనుక ఓ కారణం ఉందట. అదేంటంటే..

Continues below advertisement

ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని శుభ్రం చేసుకోవాలని చెప్తారు. అందుకే పండుగ సమయంలో చాలామంది ఇంట్లో సానుకూల శక్తి కోసం క్లీనింగ్ చేస్తూ ఉంటారట. ఇలా చేయడం వల్ల వివాదాలు, రిలేషన్స్​లోని చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని అంటారు. అయితే మీకు తెలుసా? క్లీనింగ్ చేసేప్పుడు కొన్ని వస్తువులు తీయకపోతే సానుకూల శక్తి రాదట. పైగా అవి ఎప్పుడూ ప్రతికూలమైన ఎఫెక్ట్స్ ఇస్తాయట. అందుకే ఇంటిని క్లీన్ చేసేప్పుడు కొన్ని వస్తువులు తీసేయాలంటున్నారు. ఇవి ఇంట్లో శాంతి, సామరస్యం, శ్రేయస్సును అందిస్తాయట. 

ఇంట్లో ఉంచకూడని 6 వస్తువులు ఇవే

  • పాత బట్టలు : ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటూ.. మీరు ధరించని డ్రెస్​లను ఇంట్లో ఉంచకూడదట. పాత బట్టలు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయట. వాటిని బయటపడేయడం వల్ల అల్మారా క్లీన్ అవ్వడమే కాదు.. మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. 
  • పగిలిపోయిన లేదా దెబ్బతిన్న వస్తువులు : శుభ్రపరచడం అంటే ఊడ్చడం లేదా తుడవడం మాత్రమే కాదు. ఇంట్లో పగిలిపోయిన లేదా విరిగిన పాత్రలను బయటపడేయాలట. ఎందుకంటే వాటిని ఉంచడం వల్ల సానుకూల శక్తి ఉండదట. పైగా ఇది మానసిక స్థితిపై ప్రతికూలంగా ప్రభావం చూపుతుందని అంటారు.
  • ఉపయోగించని మందులు : మీరు ఉపయోగించని మందులు, లేదా గడువు దాటిన మందులు పారవేయమని చెప్తారు. గడువు ముగిసిన మందులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగించడమే కాకుండా.. ఇంట్లో ప్రతికూల శక్తిని ఇస్తాయట.
  • పాత కాగితాలు, బిల్లులు: పాత బిల్లులు, రసీదులు ఖర్చులు తెలుసుకోవడం కోసం ఉంచుకోవచ్చు. అయితే వాటిని కుప్పలుగా పేర్చుకోవడం మంచిది కాదు. ఇవి సంపద ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయట. వాటిని క్లియర్ చేయడం వలన ఆర్థిక శక్తి, శ్రేయస్సు మీ ఇంటిలోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తుందట.
  • అరిగిపోయిన బూట్లు : చెల్లాచెదురుగా ఉన్న లేదా అరిగిపోయిన బూట్లు లేదా చెప్పులు పాడేయమే మంచిది. పాత, దెబ్బతిన్న పాదరక్షలు భావోద్వేగపరంగా నెగిటివ్​ ఎనర్జీ ఇస్తాయట. వాటిని తొలగించడం ద్వారా సమతుల్యత, సానుకూలత పెరుగుతుందట.
  • ఓల్డ్ డెకరేషన్స్ : పాత లేదా అరిగిపోయిన అలంకరణ వస్తువులను కొత్త వాటితో భర్తీ చేయండి. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంట్లోకి తాజా, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. 

ఇవి క్లీన్ చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసర ఖర్చులు చేయరు. డబ్బును కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. పైగా వీటిని క్లీన్ చేయడం వల్ల రూమ్ ఖాళీగా మారుతుంది. ఇంట్లోకి రాగానే మంచి పాజిటివిట్ ఫీల్ వస్తుంది.  దీనివల్ల ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారు. ఆనందం, శ్రేయస్సుతో నిండిన సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇంట్లో నెగిటివిటీని ఇచ్చే వాటిని వీలైనంత తొందరగా తీసేయండి. 

Continues below advertisement