Christmas vacation in India : క్రిస్మస్ అంటే ఇంట్లో కూర్చొని చేసుకునే పండుగేమి కాదు. నలుగురితో కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగగా చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పబ్లిక్ హాలీడ్లు ఉంటాయి. అంతేకాదు క్రిస్మస్ 2023 సమయంలో లాంగ్ వీకెండ్ వచ్చింది. అయితే ఈ సమయంలో మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఇండియాలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల లిస్ట్ ఉంది. ఇవి క్రిస్మస్ సమయంలో మీ వెకేషన్‌కు మంచి ఎంపిక అవుతుంది.
ఇండియాలో వింటర్లో వెళ్లగలిగే హాలిడే డెస్టినేషన్స్ చాలానే ఉన్నాయి. అయితే క్రిస్మస్ సమయంలో మీ వెకేషన్‌ని రెట్టింపు చేసే ప్లేస్‌లు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో ఏవి మీ బడ్జెట్‌కు దగ్గర్లో ఉన్నాయో.. మీ ప్లాన్‌కి బాగా సెట్ అవుతాయో ఎంచుకోండి. మీకు, మీ ఫ్యామిలతో, ఫ్రెండ్స్ వెళ్లగలిగే.. మీకు మంచి అనుభూతినిచ్చే డెస్టినేషన్స్‌లో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోవా
క్రిస్మస్ సమయంలో మీరు ఇండియాలో వెళ్లగలిగే డెస్టినేషన్‌లో ముందుగా ఉండేది గోవా. అక్కడ క్రిస్మస్ డెకరేషన్లు, బీచ్లలోని సూర్యకిరణాలు మీ పండుగ వైబ్స్‌ని రెట్టింపు చేస్తాయి. బీచ్పార్టీలు, లైవ్ మ్యూజిక్, ప్రత్యేకమైన క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్ మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక్కడ గోవా చర్చ్‌లో మీరు క్రిస్మస్ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. అక్కడ దొరికే క్రిస్మస్ స్వీట్లు, సీఫుడ్ డిలైట్లు మీకు మంచి విందుగా మారుతాయి.
సిమ్లా
మంచుతో నిండి ఉండే సిమ్లా అందాలు.. ముఖ్యంగా వింటర్లో దాని ప్రకృతి అందాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. క్రిస్మస్ అంటే వైట్ స్నో, ఎర్రని లైట్స్, పచ్చని చెట్లు. మీరు సిమ్లా వెళ్తే ఇలాంటి అందాలే చూడొచ్చు. మెరిసే లైట్లతో కూడిన వీధులు.. రంగు రంగుల లైట్లు, డెకరేషన్తో చక్కగా ముస్తాబైన ఇండ్లు మీ మనసును ఆకట్టుకుంటాయి. ఇక్కడ హిల్ స్టేషన్లో ఉండే చర్చ్‌కు మీరు వెళ్లి.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవచ్చు.
మనాలి..
అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు మనాలి పెట్టింది పేరు. ఇక్కడ మంచుతో కప్పి ఉన్న హడింబా దేవి ఆలయాన్ని మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని మీకు అందిస్తుంది. అక్కడ మీరు వివిధ రకాల వంటకాలు ఆస్వాదించవచ్చు. మీకు స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టముంటే మీరు కచ్చితంగా ఇక్కడ మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
ఉదయ్‌పూర్
సిటీ ఆఫ్ లేక్స్‌గా రాజరిక చరిత్ర కలిగి ఉంది ఉదయ్‌పూర్. ఇది సాంస్కృతిక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు పిచోలా లేక్‌లో పడవ ప్రయాణం చేయవచ్చు. అక్కడి వాస్తు శిల్పకళలు మీకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా పండుగ సీజన్లో వాటికి చేసే అలంకరణలు మీకు ఎక్స్ట్రా బోనస్ అనే చెప్పవచ్చు. సిటీ ప్యాలెస్, జగ్ మందిర్‌తో సహా వివిధ రాజభవనాలు మీకు రాజశోభను అందిస్తాయి.
కొచ్చి
కేరళలో జరిగే క్రిస్మస్ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ దాదాపు అందరు క్రిస్మస్ చేసుకుంటారు. ఈ సమయంలో కేరళలోని చర్చిలను అందంగా ముస్తాబు చేస్తారు. ఇక్కడ బోటింగ్ ప్రయాణం మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పచ్చని చెట్ల మధ్య మీరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.
ఇంకెందుకు ఆలస్యం.. వచ్చే క్రిస్మస్కి మీరు ఓ ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకుని క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోండి.
Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?