ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు వస్తుండటంతో ఆయన చూపు అటు ఉంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి కొన్ని రోజుల టైం ఇచ్చారు. దాంతో ఆయన సినిమా షూటింగులకు తాత్కాలికంగా విరామం ఇవ్వక తప్పలేదు. ఆ విషయాన్ని 'ఓజీ' టీం చెప్పింది. ఒక విధంగా పవన్ అభిమానులకు అది నిరాశ కలిగించే అంశమే. అసలు వివరాల్లోకి వెళితే... 


ఇప్పుడు షూటింగ్ చేయడం లేదు!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని మీనింగ్. బాంబే మాఫియాను ఎదిరించి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ 80 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాక్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 


''పుట్టినరోజు శుభాకాంక్షలతో మా టైమ్ లైన్ అంతా నిండిపోయింది. అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆకలి మీద ఉన్నారు. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమంటే... ప్రస్తుతం మేం షూటింగ్ చేయడం లేదు. అందువల్ల, అప్డేట్స్ ఇవ్వడం కోసం మరింత టైం పడుతుంది. వెండితెర మీద తమ అభిమాన దేవుడిని చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ రోజులు వెయిట్ చేయక తప్పదు'' అని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సో... షూటింగ్ పూర్తి చేశాక విడుదల తేదీ గురించి చెబుతారన్నమాట. ఆల్రెడీ విడుదలైన టీజర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. 


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!










డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నిర్మించారు. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!



'ఓజీ'లో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు, 'ఖైదీ' & 'విక్రమ్' ఫేమ్ అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్, సంగీతం : ఎస్. థమన్, నిర్మాత : డీవీవీ దానయ్య, రచన - దర్శకత్వం : సుజీత్.