KCR Hospitalized: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి (BRS Party) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఆయన పెద్దగా, హుందాగా ఉండాలి!
నేను కుర్ర వేషాలు వేయాలి - చిరు సరదా!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం సోమవారం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మాజీ సీఎంను పరామర్శించారు. చిరుకు కెసిఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆస్పత్రి గదిలోకి సంతోష్ తీసుకు వెళ్లారు. కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉందని  ఆస్పత్రిలో వైద్యులు, చిరంజీవి మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. 


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!


కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చికిత్స అందిస్తున్న వైద్యులు చిరంజీవితో 'మీరు వస్తుంటే ఎవరో అబ్బాయి అనుకున్నాను. మీ అబ్బాయి అనుకున్నా. టీ షర్టులో చూసి! సరిగా గుర్తు పట్టలేదు' అని అన్నారు. అప్పుడు చిరంజీవి ''మేం కుర్ర వేషాలు వేయాలి. అది మా బతుకు దెరువు. వారు (కెసిఆర్ ను చూపిస్తూ) పెద్దరికంగా ఉండాలి' అని చిరంజీవి చెప్పారు. 


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!






వచ్చే నెల 15 వరకు కొంచెం గ్యాప్ ఉంది!
చిరంజీవిని సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నారు కెసిఆర్. 'నాకు ఈ నెల, వచ్చే నెల 15 వరకు కొంచెం గ్యాప్ ఉంది' అని చిరు చెప్పారు. ఇద్దరు కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.






ప్రస్తుతం చిరంజీవి ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో భారీ సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాలో త్రిష ఓ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.