Christmas Balcony Decoration Ideas : బాల్కనీలు ఇంటి విలువను, ఆకర్షణను పెంచుతాయి. అందుకే చాలామంది ఇల్లు తీసుకునే ముందు, అద్దె ఇల్లు అయినా సరే బాల్కనీని కోరుకుంటారు. ఇవి ఇంటికి వెచ్చదనాన్ని, మంచి అనుభూతిని ఇస్తాయి. మీ ఇళ్లు అందంగా కనిపించాలంటే.. బాల్కానీని కూడా అందంగా సర్దుకోవాలి. బాల్కనీ అందంగా ఉంటే చాలు. ప్రశాంతంగా అక్కడే సమయాన్ని గడిపేయవచ్చు. ఈ క్రిస్మస్ సమయంలో బాల్కనీని అందంగా మార్చగలిగే చిట్కాలు ఇప్పుడు చూసేద్దాం.
లేయర్డ్ ఫెయిరీ లైట్లు
మంచి లైటింగ్ డీప్ కనెక్షన్ ఇస్తుంది. ఇది బాల్కానీని ఆకర్షణీయంగా మార్చేస్తుంది. లేయర్డ్ ఫెయిరీ లైట్లు లేదా LED కర్టెన్లు వార్మ్ లైటింగ్‌ను ఇస్తాయి. ఇది బాల్కానీ లుక్‌కి హైలెట్‌గా ఉంటుంది. ఇంటిని చూసేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది. పండుగ సీజన్‌లో చూడడానికి బాగుంటుంది. ముఖ్యంగా చలికాలంలో చీకటి త్వరగా వస్తుంది. ఆ సమయంలో ఈ లైట్స్ చాలా అందంగా కనిపిస్తాయి.
సీటింగ్ అరేంజ్మెంట్స్
లెట్స్తో అందంగా అందంగా సిద్ధం చేసుకున్న బాల్కనీలో కూర్చోకుంటే ఎలా? కాబట్టి మంచి సీటింగ్‌ను అరేంజ్ చేయండి. కాసేపు ఇంట్లోవారితో, స్నేహితులతో వేడి వేడిగా హాట్ చాక్లెట్ తాగుతూ లేదా.. స్నాక్స్ తింటూ మంచి టైమ్‌ని స్పెండ్ చేయవచ్చు. ప్లష్ త్రోలు, దిండ్లు సపోర్ట్ కోసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
క్రిస్మస్ ట్రీ సెటప్
క్రిస్మస్ సమయంలో బాల్కనీ డెకరేషన్ అంటే.. క్రిస్మస్ ట్రీ ఉండాల్సిందే. కాబట్టి బాల్కనీలో ఓ వైపు స్టూల్ వేసి లేదా గోడకు అమర్చగలిగే క్రిస్మస్ ట్రీని ఎంచుకోండి. చిన్న స్థలంలోనే పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేయగలిగే టిప్ ఇది.
ఆకుపచ్చని మొక్కలు
ఎవర్ గ్రీన్, పోయిన్‌సెట్టియాస్, బెర్రీ-బ్రాంచ్ యాసలతో కూడిన కుకీ-కట్టర్ డిజైన్‌లను ఉపయోగించి.. మీ బాల్కానీని కలర్ఫుల్గా మార్చేయండి. ఆకుపచ్చని మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే భావోద్వేగ ప్రతిస్పందన ఇంటికి ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది.
రస్టిక్ మెటాలిక్ డెకర్
LED కొవ్వొత్తితో కూడిన లాంతర్లు వంటివి యూరోపియన్ అనుభూతిని ఇస్తాయి. ఈ రకమైన డెకర్ అటు ట్రెడీషనల్, ట్రెండీ వైబ్స్ ఇస్తుంది. కాబట్టి సింపుల్ లాంతర్లు వాటిలో మంచి సువాసనను ఇచ్చే క్యాండిల్స్ పెడితే వాతావరణం చాలా అద్భుతంగా మారిపోతుంది.
క్రిస్మస్ రిలేటడ్ డెకరేషన్స్
దండలు, స్నోఫ్లేక్‌లు, జింక బొమ్మలు వంటి క్రిస్మస్ లుక్‌ని పెంచే.. ఐటమ్స్ కొని బాల్కానీని సిద్ధం చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీలతో కూడిన దండలు, శాంటాక్లాజ్, రెడ్, గ్రీన్ కాంబినేషన్స్‌లో ఉండే డెకార్ మంచి లుక్ ఇస్తాయి.
మినీ వింటర్ వండర్‌ల్యాండ్
వింటర్ ట్రీలు, ఫెస్టివల్ మగ్స్, టేబుల్ రన్నర్‌లు బాల్కనీని అందమైన ప్రదేశంగా మారుస్తాయి. టేబుల్‌పై కూడా ఫెయిరీ లైట్స్ పెట్టి.. మంచి థీమ్ డెకరేట్ చేసుకుంటే బాల్కనీ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
గోడలను స్టైల్ చేయండిలా
ప్రీ-లైట్ గర్లాండ్‌లు, వాల్ డెకరేషన్స్, మాక్రేమ్ డెకర్ బాల్కనీకి మంచిగా నప్పుతాయి. దీనివల్ల ఫ్లోర్‌పై ఎక్కువ డెకరేట్ చేయకపోయినా లుక్ బాగుంటుంది. చిన్న బాల్కనీలు ఉన్నవారు ఇలా వాల్ డెకర్‌ని ప్రిఫర్ చేయవచ్చు.
మరి ఈ క్రిస్మస్కి మీ ఇంటి బాల్కనీని ఈ టిప్స్‌తో మీకు నచ్చినట్లు డెకరేట్ చేసుకోండి. అయితే డెకరేషన్ పూర్తి అయ్యాక స్టార్ పెట్టడం మాత్రం అస్సలు మరచిపోవద్దు. అదే మెయిన్ ఇంపార్టెంట్ డెకరేషన్.