Second Hand Maruti Baleno Buying Guide: భారత మార్కెట్‌లో Maruti Suzuki Balenoకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ లుక్, విశాలమైన కేబిన్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ – ఈ కారణాల వల్ల బాలెనో కొత్త యూనిట్‌కు మాత్రమే కాకుండా యూజ్డ్ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, కుటుంబ అవసరాలకు సరిపడే కారు కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

Continues below advertisement

ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో ₹7.30 లక్షల దాకా వెచ్చిస్తే, 20,000 కిలోమీటర్ల లోపే నడిచిన టాప్ వేరియంట్ Baleno మాన్యువల్ దొరికే అవకాశముంది. కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక విషయాలు తప్పకుండా గమనించాలి.

Maruti Suzuki Baleno ఇంజిన్‌

Continues below advertisement

Balenoలో 1.2 లీటర్, 4 సిలిండర్, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90hp శక్తి, 113Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. 

Maruti CNG వేరియంట్ కూడా వచ్చింది. ఇందులో అదే ఇంజిన్ ఉన్నా, శక్తి 77hp, 98.5Nmకి తగ్గుతుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

Baleno మైలేజ్

పెట్రోల్ మాన్యువల్ – 22.35 కిలోమీటర్లు లీటర్‌కు (ARAI)

పెట్రోల్ AMT – 22.94 కిలోమీటర్లు లీటర్‌కు

CNG – 30.61 కిలోమీటర్లు కిలోకు

ఎక్కువ డ్రైవింగ్ చేసే వారు, రన్నింగ్ ఖర్చులు తగ్గించాలని అనుకునేవారికి CNG సరిపోతుంది. అయితే బూట్ స్పేస్ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. సాధారణ వాడకానికి పెట్రోల్ వేరియంట్‌ మరింత ప్రాక్టికల్‌గా ఉంటుంది. నగరంలో డ్రైవింగ్ ఎక్కువైతే AMT ఆటోమేటిక్ మంచి కంఫర్ట్ ఇస్తుంది.

Baleno వేరియంట్లు, ఫీచర్లు

Baleno Sigma, Delta, Zeta, Alpha అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ స్పెక్ Alpha వేరియంట్‌లో...

  • 9 ఇంచ్ టచ్‌స్క్రీన్
  • Android Auto, Apple CarPlay
  • హెడ్-అప్ డిస్‌ప్లే
  • 360 డిగ్రీ కెమెరా
  • ఆటో క్లైమేట్ కంట్రోల్
  • Arkamys సౌండ్ సిస్టమ్
  • ఆటో LED హెడ్‌ల్యాంప్స్‌
  • 16 ఇంచ్ అలాయ్ వీల్స్
  • 6 ఎయిర్‌బ్యాగ్స్

వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ పరిమితంగా ఉంటే Zeta వేరియంట్ కూడా అవసరమైన ఫీచర్లతో సరిపోతుంది.

ఉపయోగించిన బాలెనో కొనుగోలు చేయాలంటే, ముందుగా ఇవి తప్పక చెక్ చేయండి

AMT గేర్‌బాక్స్ హెల్త్‌AMT సాధారణంగా నమ్మకంగానే ఉంటుంది. అయితే, టెస్ట్ డ్రైవ్ సమయంలో గేర్ మార్పులు స్మూత్‌గా ఉన్నాయా, కారు సరిగా కదులుతోందా అనే విషయాలు గమనించాలి.

టచ్‌స్క్రీన్ సమస్యలుకొంతమంది యూజర్లకు టచ్‌స్క్రీన్ ల్యాగ్, ఫ్రీజ్ అవడం, కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయి. కాబట్టి స్క్రీన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి.

ఎయిర్‌బ్యాగ్ రీకాల్2022 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య తయారైన కొన్ని Baleno కార్లను ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ సమస్య కారణంగా రీకాల్ చేశారు. ఆ రిపేర్ పూర్తయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ Baleno ధరలు

ప్రస్తుతం యూజ్డ్ మార్కెట్‌లో హయ్యర్‌ వేరియంట్ల ధరలు ₹5.5 లక్షల నుంచి ₹7.5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. ₹7.5 లక్షలకు మించి ఖర్చు చేయకపోవడమే మంచిది. అంతకంటే ఎక్కువ అయితే కొత్త కారు తీసుకోవడం బెటర్.

ముగింపు

తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, విశాలమైన కేబిన్ కావాలంటే యూజ్డ్ Maruti Baleno ఒక సేఫ్ ఛాయిస్. సరైన కారు ఎంపిక చేసుకుంటే, ఇది సంవత్సరాల పాటు నమ్మకంగా సేవ చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.