Anu Acharya Speech : ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో Ocimum Bio Solutions and Mapmygenome సీఈఓ అను ఆచార్య పాల్గొన్నారు. క్యాన్సర్ విషయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కారకాలపై అవగాహన కల్పించారు అను. ఇంట్రెస్టింగ్​గా పొట్టి, మొండిగా ఉండే మహిళలు ఎక్కువకాలం బతుకుతారంటూ స్టేట్​మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


క్యాన్సర్​పై అవగాహన


బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్​పై మహిళలు అవగాహన కలిగి ఉండాలంటున్నారు. క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలను ముందుగానే గుర్తించాలని చెప్తున్నారు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్​ను ఆరు నెలలకు ఓ సారైనా చేయించుకోవాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు కనీసం సంవత్సరానికి ఓసారి మమ్మోగ్రామ్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపారు. 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళ సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని.. 18 ఏళ్లు దాటిన వారు పెల్విక్ ఎగ్జామిన్ చేయించుకోవాలన్నారు. వీటిని రెగ్యూలర్​గా చేయించుకుంటే మహిళల్లో క్యాన్సర్ సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


హెల్తీ డైట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్, లో ఫ్యాట్, హై ఫైబర్ డైట్​ని డైట్​లో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. బరువును అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు దూరంగా ఉంచుకుంటే మంచిది. 


పొట్టిగా ఉంటే.. మంచిదా?


పొట్టిగా, మొండిగా ఉండే మహిళలు ఎక్కువ కాలం బతుకుతారని అను తెలిపారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ గ్రెనోటాలజీ చేసిన స్టడీల్లో ఈ విషయం తేలింది. పొట్టిగా ఉండే మహిళల్లో ఈస్ట్రోజన్ లెవిల్స్ తక్కువగా ఉంటాయట. ఇవి క్యాన్సర్​ రిస్క్​ని తగ్గిస్తాయట. అలాగే కొన్ని జెనిటిక్స్ సమస్యలు ఎత్తుతో ముడిపడి ఉంటాయని.. అలా పొట్టిగా ఉండేవారికి ఆ సమస్యలు దూరంగా ఉంటాయని తేలింది. అలాగే వారు ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లను ఎక్కువగా ఫాలో అవుతారట. దీనివల్ల వారికి జీవితకాలం పెరుగుతుందని చెప్తున్నారు. 


Also Read : దీపావళి స్పెషల్ స్వీట్స్.. సింపుల్​గా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీలు ఇవే