చర్మ సంరక్షణకు, చర్మ సౌందర్యం కోసం వినియోగించే ఉత్పత్తులలో, షాంపులు, బాడీ సోప్స్, లోషన్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. లాటిన్ మహిళలు, కొన్ని దేశాల వారు వినియోగించే చర్మ సంరక్షణ, శరీర సంరక్షణ ఉత్పత్తులలో క్యాన్సర్ కారకం అయిన ఫార్మాల్డిహైడ్ ఉందని రీసెర్చర్లు గుర్తించారు. 

వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, షాంపులు, బాడీ లోషన్లపై ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. క్యాన్సర్ తో ముడిపడి ఉన్న ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్‌ను షాంపూలు, లోషన్లు, స్నానం చేసేందుకు వడే సబ్బులతో పాటు ఐలాష్ వంటి వాటి తయారీలో వినియోగిస్తున్నారు. వాటి లైఫ్ టైం పెంచడానికి కార్సినోజిన్ ఫార్మాల్డిహైడ్‌ను పలు సంస్థలు వినియోగిస్తున్నాయి. 

ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టాక్సికాలజీ  ఇటీవల అధ్యయనం ప్రకారం.. నల్లజాతివారు, లాటినా మహిళలలో సగానికి పైగా ఫార్మాల్డిహైడ్ విడుదల చేసే రసాయనాలున్న  వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ కలిగించే రసాయనాలు వారు వాడే ఉత్పత్తులలో ఉన్నాయనే వాస్తవాన్ని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. 

అధ్యయనంలో ఏం తేలిందిలాస్ ఏంజిల్స్‌లోని 70 మంది నల్లజాతి, లాటినా మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో వారు వినియోగించే సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఓ యాప్ ద్వారా ఆ మహిళలు తాము వినియోగించే ఉత్పత్తుల లేబుల్‌ల ఫొటోలను సమర్పించారు. వారిలో 53 శాతం మంది ఫార్మాల్డిహైడ్ విడుదల చేసే రసాయనాలను కలిగి ఉన్న కనీసం ఒక ప్రొడక్ట్ ఉపయోగించారు. కొన్ని ఉత్పత్తులు రోజుకు ఓసారి, కొన్ని ప్రొడక్ట్స్ అయితే వారంలో చాలాసార్లు వినియోగించారు. సర్వే చేసిన 58 శాతం హెయిర్ కేర్ ఉత్పత్తులలో, వివిధ షాంపూలు, బాడీ లోషన్లు, సబ్బులు, ఐలాష్ గ్లూలలో సైతం ఈ క్యాన్సర్ కారకం ఉన్నట్లు గుర్తించారు.

పీర్ రివ్యూడ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ లెటర్స్‌లో చర్మ సంరక్షణ, సౌందర్య సాధనాలలో ఫార్మాల్డిహైడ్,  ఫార్మాల్డిహైడ్ విడుదల చేసే ప్రిజర్వేటివ్‌లు ఉన్నాయని హైలైట్ చేసింది. వాటి వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) గతంలో ఫార్మాల్డిహైడ్ మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులలో సైతం క్యాన్సర్ కారకాలు ఉండటంపై ఆందోళన నెలకొంది.  లాటిన్, నల్లజాతి మహిళలు ఫార్మాల్డిహైడ్‌ ఉన్న ఆ చర్మ సౌందర్య, శరీర సంరక్షణ ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.   సంరక్షణ ఉత్పత్తులలో ఫార్మాల్డిహైడ్‌ను వెల్లడిస్తుంది.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..రీసెర్చ్ చేసిన ప్రధాన డాక్టర్ రాబిన్ డాడ్సన్ మానవ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. మనం వాడే చాలా ఉత్పత్తులలో ఇలాంటి హానికారక రసాయనాలు ఉంటాయి.  ఫార్మాల్డిహైడ్ కలిగిన ఉత్పత్తులను గుర్తించడానికి వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను కూడా తెలిపారు.  ఎందుకంటే అనేక సంరక్షణకారులు "ఫార్మాల్డిహైడ్" అని స్పష్టంగా తెలియకుండా వేరే పేర్లతో మిశ్రమాలు ఉంటాయన్నారు.

అనేక అమెరికాలోని రాష్ట్రాలు, యూరోపియన్ యూనియన్ ఫార్మాల్డిహైడ్‌పై నిషేధం విధించింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 2023లో దేశవ్యాప్తంగా నిషేధాన్ని సూచించింది. కానీ వాటిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. చర్మ సంరక్షణ ఉత్పత్తులు హాని కారక రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు.