Neck Pain From Phone : మారుతున్న సమాజంలో ఇన్నోవేటివ్​గా కొత్త టెక్నాలజీ ఎలా వస్తుందో.. దానికి తగ్గట్లుగానే కొత్త రోగాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో టెక్స్ట్ నెక్ ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ టెక్స్ట్ నెక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు తెలిపారు. దాదాపు చాలామంది యువత ఈ టెక్స్ట్ నెక్​తో సఫర్ అవుతున్నారని.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవని అంటున్నారు. ఇంతకీ ఈ టెక్ట్స్ నెక్ ఏంటి? దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

టెక్ట్స్ నెక్ 

టెక్ట్స్ నెక్ అనేది మెడ దగ్గర తీవ్రమైన నొప్పిని లేదా ఇబ్బందిని సూచిస్తుంది. ఎక్కువగా టెక్ట్స్ చేస్తూ ఫోన్​లో లేదా ల్యాప్​టాప్​లో గడిపేవారికి ఈ సమస్య వస్తుంది. ఎక్కువకాలం ఇది కొనసాగితే దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. ఈ సమస్య 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి ఎక్కువ వస్తుందట. ఎందుకంటే వారిలో 79 శాతం మంది తమ ఫోన్​లను దాదాపు అన్ని సమయాల్లో వినియోగిస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. 

మొబైల్ ఫోన్​ వినియోగం అనేది ఈరోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది. ఏమి చేసినా, ఏమి చేయకపోయినా ఫోన్​లో మునిగిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల టెక్ట్స్ నెక్ సమస్య వస్తుంది. కేవలం మొబైలే కాకుండా ల్యాప్ టాప్ ఇతర గాడ్జెట్స్ ఉపయోగించేవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 

టెక్స్ట్ నెక్ లక్షణాలు

టెక్స్ట్ నెక్ సమస్య ఉన్నవారికి తరచూ తలనొప్పి రావడం, మెడ దగ్గర పట్టేయడం, భుజాల దగ్గర నొప్పి, తీవ్రమైన మెడ నొప్పి సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో చేతులు, చేతివేళ్లు తిమ్మర్లు ఎక్కడం, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలను చూపిస్తాయట. 

టెక్ట్స్​ నెక్​తో వచ్చే సమస్యలు

ఫోన్​ని, ఇతర గ్యాడ్జెట్స్​ని చూసేందుకు చాలామంది తమ మెడను ముందుకు వంచి.. పని చేస్తారు. దీనివల్ల మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్న వ్యక్తులకు తీవ్రమైన మెడనొప్పి ఉంటుంది. ఇదే కాకుండా కూర్చొనే భంగిమ మారిపోతుంది. వెన్నముకపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా గర్భాశయ కండరాల్లో కదలిక తగ్గడం, కండరాల బలం తగ్గిపోవడం, కీళ్ల స్థాన లోపం వంటి సమస్యలు వస్తాయి. 

టెక్ట్స్​ నెక్​కు చికిత్స

ఈ సమస్య మీలో ఉందని గుర్తిస్తే కచ్చితంగా మీరు లైఫ్​ స్టైల్​లో మార్పులు చేయాలి. భంగిమను సరైన విధంగా ఉంచుకోవడం, స్ట్రైచ్ చేయడం వంటివి చేయాలి. అతి ప్రధానంగా స్క్రీన్​ టైమ్​ని తగ్గించుకోవాలి. నెక్​కి సపోర్ట్ ఇచ్చే కూర్చీలు కొనుక్కోవాలి. వర్క్ చేసేప్పుడు లేదా ఫోన్​ వినియోగించేప్పుడు రెగ్యులర్​గా బ్రేక్స్ తీసుకోవాలి. దీనివల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది. 

పరిస్థితి చేయిదాటితే వైద్యులు సర్జరీలను సిఫార్స్ చేయవచ్చు. ఎందుకంటే కొందరికి ఈ టెక్ట్స్ నెక్ సమస్య వల్ల డిస్క్​ జారిపోవడం, నరాల బలహీనతలు ఏర్పడడం జరుగుతాయి. అలాంటి తీవ్రమైన పరిణామాల్లో వైద్యులు సర్జరీలు చేస్తాయి. అదీ కూడా ఈ టెక్ట్స్ నెక్ వల్ల వచ్చిన సమస్యలతో మీరు మీ పనులు కూడా చేసుకోలేనప్పుడు ఇలా జరుగుతుంది. ఫిజికల్ థెరపీ, ఐస్ లేదా హీట్ థెరపీ, మసాజ్​లు కూడా చికిత్సలో భాగమే.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.