Heart Attack: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఒకే పరీక్ష చేయడం ద్వారా రెండు రకాల ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఎముక గట్టిగా ఉందో లేదో తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ నిర్వహిస్తారు. ఈ స్కాన్ నిర్వహించడం వల్ల ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. అయితే అలాగే గుండెపోటు భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలుసుకునే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చేసిన పరిశోధనలో తేలింది. నిజానికి ఎముకలు పెళుసుగా మారాయో, గట్టిగా ఉన్నాయో తెలుసుకోవడానికి డెక్సా స్కానింగ్ చేస్తారు. దీనివల్ల గుండెపోటు ముప్పును కూడా తెలుసుకోవచ్చని పరిశోధకులు కొత్తగా కనిపెట్టారు. గుండె నుంచి పొట్టలోనికి వచ్చే ధమనిలో కాల్షియం ఉంటుంది. గట్టిపడిన ఈ కాల్షియం కూడా స్కాన్‌లో కనిపిస్తుంది. అలా కనిపించిందంటే రక్తనాళాలు గట్టిపడుతున్నాయి అని సూచించే సంకేతం. అంటే రక్త నాళాల్లో భవిష్యత్తులో పూడికలు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా పూడికలు వస్తే గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇలా స్కాన్ ద్వారా ఎముకలతో పాటు గుండె ఆరోగ్యాన్ని కనిపెట్టొచ్చు.


అయితే పొట్టలోని ధమనిలో ఉన్న కాల్షియానికి సంబంధించి స్కానింగ్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. నిజానికి డెక్సా స్కాన్ అనేది గుండు పోటును పరీక్షించేది కాదు, కానీ ఇప్పుడు పరిశోధకులు చెబుతున్న దాన్నిబట్టి ఈ ధమనిలోని కాల్షియన్ని లెక్కగడితే, గుండెపోటు ముప్పు ఉందో లేదో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ముందే ప్రాణాన్ని కాపాడుకోవచ్చని వారి ఆశ. ధమనుల్లో పేరుకున్న కాల్షియాన్ని అధికంగా చేరుకుంటే గుండెపోటు ముప్పు అధికంగా ఉన్నట్టే లెక్క. దీర్ఘకాలంలో ఇలా కొనసాగితే వారు జీవించడం కూడా కష్టమేనని చెబుతున్నారు పరిశోధనాకర్తలు.


ఆకుకూరలను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, మెంతి కూర, గోంగూర, ముల్లంగి ఆకులు, మునగ ఆకులు తింటూ ఉండాలి. ఇవి గుండెకు, ఎముకలకు కూడా బలాన్ని ఇస్తాయి. వంట నూనెల్లో ఆలివ్ ఆయిల్‌నూ వాడుతూ ఉండాలి.  ఇది గుండెకు బలాన్నిస్తుంది. అవకాడో పండ్లను తరచూ తింటూ ఉండాలి. అల్పాహారంలో భాగంగా ఓట్స్ ను అధికంగా తింటూ ఉండాలి. ఓట్స్ తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. గుండెకు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. అందుకే రోజూ ఓట్స్‌తో తయారుచేసిన ఆహారాలు అధికంగా తినాలి. వాల్ నట్స్‌ను కూడా తింటూ ఉండాలి. గుండె ఆరోగ్యం కోసం వీటిని కచ్చితంగా తినాలి. రోజూ ఉదయం నానబెట్టిన వేరుశెనగ పలుకులను తింటూ ఉండాలి. నారింజ పండ్లు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. 
 Also read: మనదేశంలో పెరుగుతున్న మెడ క్యాన్సర్ కేసులు, ఇది ఎందుకు వస్తుందంటే



Also read: ఆరునెలల పాటు ఈ అలవాట్లను ఫాలో అవ్వండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.