మామిడిపండ్లు ఎంతో మంది ఫేవరేట్. వేసవిలో మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. కమ్మని రుచి మాత్రమే కాదు, ఎన్నో పోషకాలు కూడా ఈ పండ్ల నుంచి లభిస్తాయి. ఈ పండ్లతో అనేక రకాల రెసిపీలు చేసుకోవచ్చు. మ్యాంగ్ ఐస్ క్రీములు, జ్యూసులు, స్మూతీలు రకరకాల రూపాల్లో వీటిని ఆస్వాదించవచ్చు. అయితే అందరికీ ఉన్న సందేహం... మధుమేహం ఉన్న వారు మామిడి పండ్లు తినవచ్చా? అని.ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.


చక్కెర అధికమే కానీ...
చాలా మంది మామిడిపండును మధుమేహులు తినవద్దని చెబుతారు. కారణం అందులో 90 శాతం చక్కెరే ఉంటుంది. కనుక మామిడి పండు తింటే మీ చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువ. అందుకే వద్దని చెబుతారు. కానీ మామిడి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇక మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 51 మాత్రమే. అంటే డయాబెటిక్ రోగులు హ్యాపీగా తినే ఇండెక్స్ ను కలిగి ఉంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి దోహదపడే ఒత్తిడి ప్రభావాన్ని కూడా 
తగ్గించేందుకు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ రక్తప్రవాహంలో చక్కెర శోషించుకోవడాన్ని నెమ్మదించేలా చేస్తుంది. ఈ రకంగా చూస్తే మామిడి పండును మధుమేహులు తింటే మంచిదే అని చెప్పాలి.  


తినాలా వద్దా?
మామిడిపండ్లను మితంగా తింటే మధుమేహులకు మంచిదే. అంటే రెండు రోజులకోసారి చిన్న పండు తినడం వల్ల మేలు జరుగుతుంది. రోజూ తినాలనిపిస్తే ఒకటి లేదా రెండు ముక్కలకు మించి తినకూడదు. అధికంగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మామిడి పండ్లు మీ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు మేలే చేస్తుంది. 


వీరికి మంచిది...
మధుమేహం లేని వ్యక్తులు మామిడి పండ్లను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. బీపీని క్రమబద్ధీకరిస్తుంది. పల్స్ రేటును సాధారణంగా ఉంచుతుంది. గుండెలో మంట, వాపు లక్షణాలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఇందులో ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడేందుకు కూడా ఇది ఎంతో అవసరం. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఈ పండులో అధికం. 


Also read: ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్, వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?


Also read: 13వ తేదీ శుక్రవారం పడితే జనాలకు ఎందుకు భయం? ఈ రోజును అరిష్టంగా ఎందుకు భావిస్తారు?